Shubman Gill : ఇంగ్లండ్ – లార్డ్స్ వేదికగా జరిగిన మూడో టెస్టు మ్యాచ్ లో స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక టీమిండియా ఓడి పోవడంపై స్పందించాడు స్కిప్పర్ శుభ్ మన్ గిల్ (Shubman Gill). తాము అద్భుతంగా ఆడామాని, కానీ ఓడి పోయామన్నాడు. ఇంకొన్ని పరుగులు చేసి ఉండి ఉంటే తాము ఆతిథ్య జట్టుపై గెలిచి ఉండేవాళ్లమని అభిప్రాయం వ్యక్తం చేశాడు. 193 పరుగుల టార్గెట్ ను ఛేదించ లేక భారత జట్టు కేవలం 170 రన్స్ కే చాప చుట్టేసింది. కానీ ఒకే ఒక్కడు మాత్రం ఒంటరి పోరాటం చేశాడు. ఆల్ రౌండర్ రవీంద్ర జడేసా 181 బంతులు ఆడి 4 ఫోర్లు ఒక సిక్స్ తో 61 పరుగులతో నాటౌట్ గా నిలవడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. ఈ సందర్బంగా జిడ్డూను ప్రశంసలతో ముంచెత్తాడు శుభ్ మన్ గిల్.
Shubman Gill Comments
చివరి బంతి వరకు ఈ టెస్టు మ్యాచ్ ఉత్కంఠను రేపిందన్నాడు. అయితే కొంత భారీ భాగస్వామ్యం నెలకొల్పలేక పోవడం ఈ ఓటమికి కారణమని భావిస్తున్నామన్నాడు. ప్రధానంగా వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ గాయపడడం కూడా ఒకింత ఇబ్బంది ఏర్పడిందన్నాడు కెప్టెన్. జట్టు పరంగా చూస్తే ప్రతి ఒక్కరు సూసపర్ షో చేశారని కితాబు ఇచ్చాడు. అటు బ్యాటింగ్ పరంగా ఇటు బౌలింగ్ పరంగా వందకు వంద శాతం న్యాయం చేశారని చెప్పాడు. ఎవరినీ తప్పు పట్టడానికి వీలులేదన్నాడు. మొత్తంగా తమ పర్ ఫార్మెన్స్ బాగుందని పేర్కొన్నాడు శుభ్ మన్ గిల్. జట్టు పరంగా చూస్తే సీనియర్ ప్లేయర్ జడేజా. తనకు ఇలా ఆడాలని చెప్పలేమన్నాడు. తను జట్టును గెలిపించేందుకు సర్వ శక్తులు ప్రయత్నం చేశాడని పేర్కొన్నాడు. సిరాజ్ గనుక అవుట్ కాక పోయి ఉంటే జట్టు గెలిచి ఉండేదన్నాడు.
Also Read : IND vs ENG 3rd Test Shocking : జిడ్డూ పోరాటం తప్పని పరాజయం
