మ‌నం ఏమిటో ఈ ప్ర‌పంచానికి చూపించాం

బాలీవుడ్ న‌టుడు ర‌ణ్ వీర్ సింగ్ కామెంట్స్

hellotelugu-RaanVeerSingh

ముంబై : ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఆదిత్య ధ‌ర్ తీసిన సీక్వెల్ మూవీ దురంధ‌ర్ -2 దుమ్ము రేపుతోంది. ఇప్ప‌టికే దురంధ‌ర్ -1 కాసుల వ‌ర్షం కురిపించింది. ఇండియ‌న్ సినిమాను షేక్ చేసింది. ఏకంగా రూ. 1000 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. దీంతో సీక్వెల్ గా తీసుకు వ‌చ్చిన దురంధ‌ర్ -2 ది రివెంజ్ పేరుతో మార్చి 19న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఆశించిన దానికంటే అద్బుత‌మైన టాక్ తో దూసుకు పోతోంది. బాక్సులు బ‌ద్ద‌లవుతున్నాయి. చూసిన ప్ర‌తిఒక్క‌రు అద్భుతంగా ఉందంటూ కితాబు ఇస్తున్నారు. దురంధ‌ర్ -2 బిగ్ స‌క్సెస్ కావ‌డం, పాజిటివ్ టాక్ రావ‌డంతో ఫుల్ జోష్ లో ఉన్నారు ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు . ఈ సంద‌ర్భంగా మూవీ స‌క్సెస్ మీట్ లో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు దురంధ‌ర్ -2లో కీల‌క పాత్ర పోషించిన బాలీవుడ్ న‌టుడు ర‌ణ్ వీర్ సింగ్.

ద‌ర్శ‌కుడు ఆదిత్య ధ‌ర్ నా వ‌ద్ద‌కు వ‌చ్చాడు. క‌థ‌ను వినిపిస్తుంటే నేను న‌మ్మ‌లేక పోయాను. అస‌లు ఇలాంటి క‌థ‌ను తెర‌కెక్కించే ధైర్యం, సాహ‌సం చేస్తే జ‌నం ఆద‌రిస్తారా అని ఒకింత అనుమానం వ్య‌క్తం చేశాను. ఆ స్టోరీ చెబుతూ వుంటే తాను ఆశ్చ‌ర్యానికి లోన‌య్యాన‌ని అన్నాడు. సార్ నిజంగా ఇలా జరుగుతుందా అంటూ ప్ర‌శ్నించాను. మీరు అసలు ఇలాంటి కథతో సినిమా తీస్తున్నందుకు నేను విస్మ‌యానికి గురైన‌ట్లు తెలిపాను. కానీ ద‌ర్శ‌కుడి ఆలోచ‌న స్ప‌ష్టంగా ఉంది. దీంతో మేం ఒక‌టే నిర్ణ‌యం తీసుకున్నాం. మ‌నం ఏమిటో ఈ ప్ర‌పంచానికి చూపించాల‌ని డిసైడ్ అయ్యామ‌న్నాడు ర‌ణ్ వీర్ సింగ్.

Exit mobile version