ముంబై : ఆదిత్య ధర్ దర్శకత్వం వహించచిన మూవీ ధురంధర్. ప్రపంచ వ్యాప్తంగా దుమ్ము రేపుతూ కాసుల వర్షం కురిపిస్తోంది. కేవలం 10 రోజుల్లోనే రూ. 550 కోట్లను దాటేసింది. రికార్డ్ బ్రేక్ చేసింది. ప్రస్తుతం రూ. 1000 కోట్లను దాటేసే పనిలో పడింది. ఎక్కడ చూసినా పాజిటివ్ టాక్ తో దూసుకు పోతోంది మూవీ. ఇందులో ప్రధాన పాత్ర అక్షయ్ ఖన్నా నటనకు వందకు పైగా మార్కులు పడ్డాయి. ఇందులోని శరారత్ పాట అత్యంత పాపులర్ గా మారింది. ప్రస్తుతం యూట్యూబ్ చార్ట్ లో నెంబర్ వన్ లో నిలిచింది. ఇంకా ఆ సాంగ్ ను ఆదరిస్తూ వస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ శరారత్ పాటకు సంబంధించి కొరియోగ్రఫీ చేసిన కొరియోగ్రాఫర్ విజయ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సోమవారం ఈ సాంగ్ పై స్పందించాడు.
తాను ముందుగా ఈ పాట కోసం ప్రత్యేకంగా మిల్కీ బ్యూటీ గా పేరు పొందిన తమన్నా భాటియాతో చేయాలని అనుకున్నామని చెప్పాడు . ఆమెను పరిగణలోకి తీసుకున్నట్లు తెలిపారు. అయితే సినిమాలోని సమతుల్యతను చెక్కు చెదరకుండా ఉంచాలనుకున్నట్లు తనకు స్పష్టం చేశాడు దర్శకుడు ఆదిత్య ధర్ అని చెప్పాడు. ఇదిలా ఉండగా ధురంధర్ సినిమా ఆసక్తికరమైన కథాంశంతో పాటు, ఈ సినిమాలో ఎక్కువగా చర్చించు కుంటున్న మరో అంశం అయేషా ఖాన్ , క్రిస్టల్ డిసౌజా నటించిన ఉత్సాహభరితమైన ‘శరారత్’ పాట. కాగా కథకు సంబంధం లేని ఐటం సాంగ్ తనకు వద్దని స్పష్టం చేశాడన్నారు. ఒకే స్టార్ నర్తకిని చేర్చడం వల్ల ప్రేక్షకుల దృష్టి కథ నుండి మళ్లి పోతుందని అన్నాడు.
https://www.youtube.com/watch?v=EnsUcQl8JKA



















