నాలెడ్జ్ ఎకాన‌మీపై దృష్టి సారించాం : సీఎం

సంస్కార స‌ద‌స్సులో చంద్ర‌బాబు నాయుడు

hellotelugu-APCM

ఢిల్లీ : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రజలు ఉన్నత స్థానాల్లో ఉండడానికి 30 ఏళ్ల క్రితం తీసుకున్న వివిధ సంస్కరణలతో కూడిన నిర్ణయాలే కారణం అన్నారు. నాలెడ్జి ఎకనామీ ద్వారా ప్రపంచ దేశాలకు నైపుణ్యాలను అందిస్తున్నాం అని చెప్పారు. త్వరలోనే ప్రొడక్ట్ పర్ఫెక్షన్ ద్వారా ప్రపంచానికి అత్యుత్తమ ఉత్పత్తులను సరఫరా చేస్తాం అని ప్ర‌క‌టించారు సీఎం. 9 అంశాలతో కూడిన నగరాలను అమరావతిలో ఏర్పాటు చేస్తున్నాం అన్నారు. క్రియేటివ్ సిటీని కూడా ఏర్పాటు చేయబోతున్నామ‌ని ప్ర‌క‌టించారు.

ప్రైవేటు శాటిలైట్లను కూడా తయారు చేసి లాంచ్ చేసేలా ఓ స్పేస్ సిటీని, డ్రోన్ల కోసం డ్రోన్ సిటీని ఏర్పాటు చేస్తున్నామ‌ని అన్నారు నారా చంద్ర‌బాబు నాయుడు. ఎలక్ట్రానిక్స్, ఏరో స్పేస్ సిటీని ఏర్పాటు చేసి పెట్టుబడులను ఆకర్షిస్తున్నాం అని తెలిపారు. ప్రివెంటివ్ హెల్త్ అనేది రియాలిటీ, క్యూరేటివ్ విధానం పైనా అంతా దృష్టి సారించాల్సి ఉందన్నారు. డ్రోన్ అంబులెన్స్ కూడా త్వరలోనే రియాలిటీగా మారబోతోందని చెప్పారు ముఖ్య‌మంత్రి. మేధావులు, నిపుణులు, వ్యూహకర్తలు ఇచ్చిన ఆలోచనల్ని అమలు చేసేందుకు భారత్ తో పాటు ఏపీ సదా సన్నద్ధంగా ఉంటుందని స్ప‌ష్టం చేశారు నారా చంద్ర‌బాబు నాయుడు.

Exit mobile version