KCR : హైదరాబాద్ – ఏపీ సర్కార్ ప్రతిపాదించిన బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం ఆపి తీరాల్సిందేనని స్పష్టం చేశారు మాజీ సీఎం కేసీఆర్ (KCR). ఫామ్ హౌస్ లో ఆయన కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా పలు అంశాలు చర్చించారు. వీటిలో ప్రధానంగా బనకచర్ల ప్రాజెక్టు తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకు భంగం కలిగిస్తుందని, దీనిని అడ్డుకుని తీరాల్సిందేనని దిశా నిర్దేశం చేశారు. క్షేత్ర స్థాయిలో పోరాడేందుకు సిద్దం కావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైన నేపథ్యంలో రాష్ట్ర రైతాంగ సంక్షేమం కోసం, వ్యవసాయ సంక్షోభాన్ని నివారించడం కోసం రాజీ లేని పోరాటాలు మరింత ఉధృతం చేయాలని స్పష్టం చేశారు కేసీఆర్.
KCR Key Comments
తెలంగాణ సాగునీటి రంగాన్ని ఆగం చేసే దిశగా.. ఆంధ్ర ప్రభుత్వం నిర్మించనున్న బనకచర్ల ప్రాజెక్ట్‌ను ఎట్టి పరిస్థితుల్లో నిలువరించాల్సిందేనని అన్నారు. అందుకు బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులను క్షేత్ర స్థాయిలో పోరాటాల కోసం కార్యోన్ముఖులను చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పాలన వైఫల్యాలను ఎండగడుతూ తెలంగాణ ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు పార్టీ తరఫున క్షేత్ర స్థాయిలో కార్యాచరణ తయారు చేయాలని ఆదేశించారు. తెలంగాణ రైతుల ప్రయోజనాలను ఫణంగా పెట్టి ఆంధ్రా ప్రయోజనాలను కాపాడేందుకు స్వయంగా ప్రభుత్వమే పాలనా విధానాలను అమలు చేయడం దుర్మార్గం అన్నారు.
తమను నమ్మిన పాపానికి, తెలంగాణ రైతాంగానికి.. శాశ్వత అన్యాయం వడిగడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ దుర్మార్గపు వైఖరిని తీవ్రంగా ఎండగట్టాలన్నారు. ఇక్కడ చంద్రబాబు.. అక్కడ మోడీల ప్రయోజనాలను కాపాడేందుకు రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి తహతహ లాడుతుండడాన్ని తెలంగాణ సమాజం గమనిస్తున్నదని అన్నారు. కన్నేపల్లి పంప్ హౌస్ దగ్గర గోదావరి జలాలను ఎత్తి పోయాలి. పంపులను ఆన్ చేయాలి. చెరువులు కుంటలు రిజర్వాయర్లను నింపాలన్నారు.
Also Read : India-US Trade War Sensational : భారత్ పై 25 శాతం సుంకం విధిస్తామంటూ ట్రంప్ హెచ్చరికలు
