Wang Chuk : లడఖ్ : పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగు చుక్ (Wang Chuk) అరెస్ట్ కు సంబంధించి కీలక ప్రకటన చేశారు లడఖ్ డీజీపీ ఎస్డీ సింగ్ జామ్వాల్. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. పీఎం ఎఫ్ సీఆర్ఏ ఉల్లంఘనకు పాల్పడినట్లు తమ విచారణలో వెల్లడైందన్నారు. ఇందుకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోందన్నారు. లేహ్ హింస వెనుక విదేశీ ప్రమేయం గురించి అడిగినప్పుడు ఆయన ఈ విధంగా స్పందించారు. విచారణ సమయంలో మరో ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారని, వారు ఏదైనా కుట్రలో భాగమైతే అసలు వాస్తవాలు ఏమిటో వెల్లడి అవుతాయని చెప్పారు డీజీపీ. ఈ ప్రదేశంలో నేపాలీ ప్రజలు కార్మికులుగా పనిచేస్తున్న చరిత్ర ఉందని, ఆ దిశగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
Wang Chuk FCRA Fraud Sensational
ఇదిలా ఉండగా సోనమ్ వాంగ్ చుక్ పాకిస్తాన్ లో జరిగిన డాన్ కార్యక్రమానికి హాజరయ్యారని, ఆయన పనిలో పనిగా బంగ్లాదేశ్ ను కూడా సందర్శించారని ఆరోపించారు. ఈ రెండింటి పర్యటనలకు సంబంధించి తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని వెల్లడించారు డీజీపీ. అంతే కాదు తను కావాలని సెప్టెంబర్ 24న లేహ్‌లో వాంగ్‌చుక్ హింసను ప్రేరేపించాడని ఆరోపించారు. వాంగ్‌చుక్‌తో టచ్‌లో ఉన్న పాకిస్తాన్ పిఐఓను పోలీసులు అరెస్టు చేశారని చెప్పారు. సోనమ్ వాంగ్‌చుక్‌కు రెచ్చగొట్టే చరిత్ర ఉందన్నారు. సోనమ్ వాంగ్‌చుక్ కేంద్రంతో చర్చలను పక్కదారి పట్టించారని ఆరోపించారు. ఇందులో కొంతమంది పర్యావరణ కార్యకర్తలు అని పిలవబడేవారు ఉన్నారు; వారి విశ్వసనీయతపై కూడా ప్రశ్నార్థకంగా ఉందన్నారు డీజీపీ. వాంగ్ చుక్ ను జోధ్ పూర్ సెంట్రల్ జైలులో ఉంచామన్నారు.
Also Read : CM Revanth Reddy Strong Focus : తెలంగాణ పునర్నిర్మాణంలో భాగం కావాలి
