VP JD Vance : అమెరికా : డొనాల్డ్ ట్రంప్ అమెరికా లో దేశాధ్యక్షుడిగా కొలువు తీరాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రధానంగా ప్రవాస భారతీయులు. ఆ దేశంలో పని చేయాలన్నా లేదా ఎంట్రీ కావాలంటే తప్పనిసరిగా వీసా ఉండాలి. ప్రధానంగా జాబ్స్ కోసం వెళ్లే వారి పరిస్థితి ఇబ్బందిగా మారింది. ఈ తరుణంలో తాజాగా తీసుకు వచ్చిన హెచ్ 1బి వీసాకు సంబంధించి కీలక మార్పులు చేసింది ట్రంప్ సర్కార్. భారీ ఎత్తున ఫీజులను పెంచింది. అయితే ఉపాధ్యక్షుడిగా ఉన్న జేడీ వాన్స్ (VP JD Vance) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధానంగా కార్మికులకు న్యాయాన్ని నిర్దారించడం, వీసా అసలు ఉద్దేశాన్ని పునరుద్దరించడం అని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతిభకు ప్రయారిటీ ఇవ్వాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
VP JD Vance Key Comments on H-1B Visa
ఇదిలా ఉండగా తాజాగా తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలు, ట్రంప్ తీసుకున్న నిర్ణయం సరైనదేనని పేర్కొన్నారు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్. దీని వల్ల అసలు వ్యక్తులు ఎవరో తేలి పోతుందన్నారు. ప్రధానంగా తమ వారికి అత్యధికంగా ఉద్యోగాలు రావాల్సిన అవసరం ఉందన్నారు. లేక పోతే ఇబ్బంది ఏర్పడుతుందన్నారు. తాము ఇతర దేశస్థులకు వ్యతిరేకం కాదన్నారు. కానీ తమ దేశానికి చెందిన వారికి కూడా ప్రయారిటీ ఇవ్వడం తప్పనిసరి చేస్తామన్నారు జేడీ వాన్స్. దేశీయ కార్మికులను చౌకైన ప్రత్యామ్నాయాలతో భర్తీ చేయడం కాదు అగ్ర ప్రపంచ ప్రతిభను నిలుపు కోవడం ముఖ్యమని మరోసారి స్పష్టం చేశారు. ప్రతి సంవత్సరం దాదాపు 10 లక్షల మంది చట్టబద్ధమైన వలసదారులను అమెరికా సంయుక్త రాష్ట్రాలలోకి అనుమతిస్తున్నందున సంస్కరణలు అవసరమన్నారు.
Also Read : BJP Shocking Azharuddin : అజారుద్దీన్ పై ఈసీకి బీజేపీ ఫిర్యాదు















