Harish Rao : హైదరాబాద్ : లండన్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ కు చేరుకున్నారు మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు. ఈ మేరకు ఆయన శంషాబాద్ ఎయిర్ పోర్టులో మీడియాతో మాట్లాడారు. తనను లక్ష్యంగా చేసుకుని మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణలు, విమర్శలు పూర్తిగా నిరాధారమని పేర్కొన్నారు. ఇదంతా వ్యక్తిగత కక్ష సాధింపు తప్ప మరోటి కాదని తోసి పుచ్చారు. తన జీవితం తెరిచిన పుస్తకమని, ఎవరైనా తన గురించి ఆరా తీసుకోవచ్చని చెప్పారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. ఆనాడు తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన సమయంలో ఎవరు ఎవరితో ఉన్నారో ఆలోచించు కోవాలన్నారు.
Harish Rao Slams Ex MLC Kavitha
కవిత దారి తప్పి తనపై ఆరోపణలు చేసిందన్నారు మాజీ మంత్రి. ఎవరూ ఆమెను నమ్మే స్థితిలో లేరన్నారు. తాను అహర్నిశలు పార్టీ కోసం పని చేశానని ఆ విషయం ఇవాళ పదవులు అనుభవిస్తున్న వారికి బాగా తెలుసన్నారు. ఆ విషయం , ఆ వాస్తవం కవితకు తెలియదన్నారు. తెలుసుకునే ప్రయత్నం చేస్తే మంచిదని హితవు పలికారు. తెలంగాణ ఆకాంక్షలు తప్పా తనకు ఇంకొకటి తెలియదన్నారు. తాను ఒక్క పైసా అవినీతికి పాల్పడినట్లు నిరూపించాలని సవాల్ విసిరారు హరీశ్ రావు (Harish Rao). ఇదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. కేసీఆర్ హయాంలో నిర్మించిన వ్యవస్థలను కావాలని బలహీన పరుస్తున్నారని ఆరోపించారు, యూరియా కొరత మధ్య రైతులకు మద్దతు ఇవ్వాలని కోరారు.
నిరాధార ఆరోపణలు చేసిన కవితకే వదిలి వేస్తున్నట్లు పేర్కొన్నారు . 25 సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఉద్యమం నా మార్గాన్ని రూపొందించిందన్నారు. ఎవరి ప్రయోజనాల కోసం తను తనను లక్ష్యంగా చేసుకుందో ప్రజలకు బాగా తెలుసన్నారు. తన విలువైన సమయాన్ని ఆమె కోసం కేటాయించాల్సిన అవసరం లేదన్నారు.
Also Read : Upendra Dwivedi Strong Warning : పాకిస్తాన్ తోక జాడిస్తే తాట తీస్తాం : ఆర్మీ చీఫ్
