బెంగళూరు : కర్ణాటక కాంగ్రెస్ పార్టీ సంచలన వ్యాఖ్యలు చేసింది ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర చేపట్టిన ప్రజా యాత్ర. ఇది పార్టీ యాత్ర కానే కాదని తన వ్యక్తిగత ప్రచారం కోసం తన తండ్రి, మాజీ సీఎం యెడ్యూరప్ప డబ్బులు ఇచ్చి చేపిస్తున్న యాత్ర అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత బీకే హరి ప్రసాద్. సోమవారం ఈ యాత్రపై స్పందించారు. మీడియాతో మాట్లాడారు. యెడ్డీ తన కుమారుడు బీవై విజయేంద్రను పార్టీ నాయకుడిగా నిలబెట్టేందుకు ఈ ర్యాలీని వాడుకుంటున్నారని ఆరోపించారు. స్థానిక బీజేపీ నేతలు విజయేంద్ర నాయకత్వాన్ని అంగీకరించడానికి సుముఖంగా లేరని అన్నారు . కర్ణాటకలో బీజేపీ చేపట్టిన పాదయాత్రను ‘డబ్బులిచ్చి నిర్వహించే యాత్ర’ అని అభివర్ణించారు. కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బీకే హరిప్రసాద్ ఆ పార్టీని ఏకి పారేశారు.
దాదాపు మూడేళ్లుగా కర్ణాటకలో బీజేపీ తమ నాయకత్వాన్ని నిలబెట్టు కోలేక పోయిందంటూ ఎద్దేవా చేశారు. ఇది నిజంగా ప్రజాదరణ పొందిన పాదయాత్ర అయితే ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చే వారన్నారు. అందుకే నేను దీనిని ‘డబ్బులిచ్చి నిర్వహించే యాత్ర అని అంటున్నానని పేర్కొన్నారు. వారు తమ నాయకత్వాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ప్రజల కోసం కానే కాదన్నారు. . మజీ సీఎం తన కుమారుడిని నాయకుడిగా నిలబెట్టాలని కోరుకుంటున్నారు, కానీ బీజేపీ నేతలు అతన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేరని బాంబు పేల్చారు. రాయచూర్ జిల్లాలోని లింగసూగూర్ నుండి సెప్టెంబర్ 1న ప్రారంభమైన ఈ యాత్ర సెప్టెంబర్ 10న బళ్లారిలో ముగియనుంది. కాంగ్రెస్ నేత నాగేంద్ర రాజీనామాతో సహా పలు అంశాలను ఈ యాత్రలో లేవనెత్తుతామని కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు అంతకు ముందు విలేకరులతో మాట్లాడుతూ పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా యాత్ర ప్రారంభం సందర్భంగా బీజేపీ నాయకుడు సి.టి. రవి మాట్లాడుతూ పార్టీ పాదయాత్రకు అన్ని ప్రాంతాల ప్రజల నుండి మద్దతు లభిస్తోందని, రాష్ట్రంలో ఎస్సీ/ఎస్టీ నిధుల దుర్వినియోగంపై పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తోందని పేర్కొన్నారు.


















