Vijay : చెన్నై : తమిళ సినీ ఇండస్ట్రీలో అత్యంత జనాదరణ కలిగిన నటుడిగా గుర్తింపు పొందాడు దళపతి విజయ్. తన సినీ కెరీర్ లో అత్యధిక విజయాలు సాధించిన సినీ హీరోగా కూడా రికార్డ్ సృష్టించాడు. అంతే కాదు సూపర్ స్టార్ రజనీకాంత్ తో సరి సమానంగా ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉన్నాడు. తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్, మేనరిజంతో ఆకట్టుకుంటూ వచ్చాడు. ఆ మధ్యన దమ్మున్న డైరెక్టర్ మురుగదాస్ తీసిన సర్కార్ లో కీ రోల్ పోషించాడు. ఆ సినిమా ద్వారా జీఎస్టీ విధానాన్ని, ఓటు వాల్యూ ఏమిటో చెప్పే ప్రయత్న చేశాడు. ఆ తర్వాత వెను దిరిగి చూడలేదు. తనతో యంగ్ డైనమిక్ డైరెక్టర్ అట్లీ కుమార్ తో తీసిన బిజిల్ దుమ్ము రేపింది. లోకేష్ కనగరాజ్ తో తీశాడు. ప్రస్తుతం తన సినీ కెరీర్ కు పుల్ స్టాప్ పెట్టాడు. ఒకే ఒక్క సినిమాతో ముగింపు పలకబోతున్నాడు. ఇదే సమయంలో గత ఏడాది ఎవరూ ఊహించని రీతిలో 10 లక్షల మంది సాక్షిగా టీవీకే పార్టీని ప్రకటించాడు.
Vijay-Sangeetha Divorce News Viral
ఇటీవలే మధురై వేదికగా మరో 4 లక్షల మందితో సభను నిర్వహించాడు. త్వరలోనే జరగబోయే శాసన సభ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని తెలిపాడు. ఈ నెలాఖరు నుంచి జనంలోకి యాత్ర చేపట్టేందుకు శ్రీకారం చుట్టాడు. అయితే గత కొంత కాలం నుంచి దళపతి విజయ్ (Vijay) తన భార్య సంగీతతో విడాకులు తీసుకుంటున్నట్లు పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతోంది. దీనిని అటు విజయ్ (Vijay) కానీ ఇటు సంగీత కాని ఖండించడం లేదు. తాజాగా వీరిద్దరూ విడి పోతారంటూ మరోసారి వార్త గుప్పుమంది. తను సీనియర్ నటి త్రిష కృష్ణన్ తో డేటింగ్ చేస్తున్నట్లు కూడా ప్రచారం జరిగింది. ఇదిలా ఉండగా ఉన్నట్టుండి సంగీత వారి కుమారుడు జాసన్ సంజయ్‌తో పాటు విమానాశ్రయంలో కనిపించారు, అతను త్వరలో చిత్ర దర్శకుడిగా అరంగేట్రం చేయబోతున్నాడు.
Also Read : Vice President Elections Interesting : ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఉత్సాహభరిత ఓటింగ్ – సాయంత్రానికే ఫలితాలు


















