Vijay Deverakonda : యంగ్ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) నటించిన కింగ్ డమ్ మూవీ ట్రైలర్ వచ్చేసింది. ఆశించిన దానికంటే అద్భుతంగా ఉందంటూ పాజిటివ్ టాక్ వస్తోంది అంతటా. దీంతో మనోడు ఫుల్ ఖుషీలో ఉన్నాడు. తన సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు రౌడీ. ఆ దేవ దేవుడు, కోరికలు తీర్చే కొంగు బంగారంగా విలసిల్లే తిరుమల పుణ్య క్షేత్రం సాక్షిగా శ్రీ వేంకటేశ్వర స్వామి గనుక తనను ఆశీర్వదిస్తే తప్పకుండా కింగ్ డమ్ ఆడుతుందన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నాడు. తనకే కాదు తనతో నటించిన వారికి, తన కుటుంబీకులందరికీ శ్రీవారు అంటే చచ్చేంత ఇష్టమన్నాడు నటుడు విజయ్ దేవరకొండ.
Vijay Deverakonda – Venkateswara Swamy
కింగ్ డమ్ కు గౌతమ్ తిన్నసూరి దర్శకత్వం వహించాడు. లవ్లీ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే కీ రోల్ పోషించింది. తను తొలిసారిగా టాలీవుడ్ లో హరీశ్ శంకర్ దర్శకత్వం వహించిన మాస్ మహారాజా నటించిన మిస్టర్ బచ్చన్ మూవీలో ముఖ్య పాత్ర పోషించింది. ఆ సినిమా అంతగా ఆడక పోయినా తన నటనకు మంచి పేరు వచ్చింది. పలు సినిమాలలో బుక్ అయ్యేలా చేసింది. దీంతో ఈ సినిమాపై మరింత నమ్మకం పెట్టుకుంది బోర్సే. అందంతో పాటు అభినయం కూడా ఉండడంతో తనకు ప్రయారిటీ ఇస్తున్నారు మూవీ మేకర్స్. కింగ్ డమ్ మూవీని ప్రతిష్టాత్మకంగా తీశాడు దర్శకుడు. కొన్ని సన్నివేశాలను శ్రీలంకలో చిత్రీకరించాడు. ఇప్పుడు విజయ్ దేవరకొండ కూడా ఈ చిత్రంపైనే ఎక్కువగా నమ్మకం పెట్టుకున్నాడు.
Also Read : Hero Pawan Kalyan – OG : ఆగస్టులో పవన్ ఓజీ ఫస్ట్ సింగిల్ రిలీజ్



















