విజయవాడ : ఏపీ రాష్ట్ర వైద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఏపీలో జరిగిన పబ్లిక్ యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లతో కీలక సమీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు అన్ని యూనివర్శిటీలకు గౌరవ చైర్మన్ గా ఉన్న అబ్దుల్ నజీర్ హాజరయ్యారు. ఈ సందర్బంగా నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాలెడ్జి బేస్డ్ సొసైటీ నిర్మాణంలో విశ్వ విద్యాలయాలదే కీలక పాత్ర అని స్పష్టం చేశారు. పబ్లిక్ యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లంతా రాష్ట్రానికి ఉన్నత విద్యా పరంగా అంబాసిడర్లు (రాయబారులు)గా మారాలని పిలుపునిచ్చారు. ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా కూటమి సర్కార్ మద్దతు ఇచ్చేందుకు సిద్దంగా ఉందని సమీక్షలో స్పష్టం చేశారు నారా లోకేష్.
ఇదే క్రమంలో గతంలో ఏపీలో పాలన సాగించిన వైఎస్ జగన్ రెడ్డి పూర్తిగా విద్యా రంగానికి తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు. ప్రధానంగా ఉన్నత విద్యా రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందన్నారు . తమ కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే కీలకమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టడం జరిగిందని స్పష్టం చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఐటీ పరంగా కంపెనీలు తీసుకు రావడంలో ముఖ్య భూమిక పోషించారని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును ఉద్దేశించి తెలిపారు. పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన యూనివర్శిటీలకు పూర్వ వైభవం తీసుకు వచ్చేలా చేశామని తెలిపారు నారా లోకేష్.















