ఢిల్లీ : బంగ్లాదేశ్ లో మైనార్టీలు, హిందువులపై జరుగుతున్న దాడులను, హత్యలను ఖండిస్తూ మంగళవారం విశ్వ హిందూ పరిషత్, భజరంగ్, ఆర్ఎస్ఎస్, హిందూ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఇల్లీలో చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. భారీ ఎత్తున జనం తరలి వచ్చారు. బంగ్లాదేశ్ సర్కార్ కు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ఈ సందర్బగా బంగ్లాదేశ్ హైకమిషన్ వెలుపల వీహెచ్‌పి నిరసన హింసాత్మకంగా మారింది . నిరసనకారులు బారికేడ్లపైకి ఎక్కడానికి ప్రయత్నించారు. బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని నినాదాలతో ఖండిస్తున్నప్పుడు వారిని అదుపులో ఉంచడానికి పోలీసులు తీవ్రంగా శ్రమించారు. తక్షణమే దాడులను ఆపాలని డిమాండ్ చేశారు. లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. తక్షణమే ఇక్కడి నుంచి రాయబారిని పంపించాలని డిమాండ్ చేశారు. కేంద్రం ఏం చేస్తోందంటూ ప్రశ్నించారు.
పొరుగు దేశంలో మతతత్వానికి నిరసనగా వీహెచ్‌పి, బజరంగ్ దళ్‌కు చెందిన వందలాది మంది కార్యకర్తలు బంగ్లాదేశ్ హైకమిషన్‌కు చేరుకున్నారు, వారు బారికేడ్ల వైపు దూసుకు రావడంతో అత్యంత భద్రత ఉన్న ఆ ప్రాంతంలో గందరగోళం నెలకొంది. అంతకు ముందు రోజు పొరుగు దేశంలో ఒక హిందూ వ్యక్తిని కొట్టి చంపిన ఘటనపై విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా ఖండించింది. మూడు అంచెల బారికేడ్లతో , అదనపు పోలీసు, పారా మిలిటరీ బలగాలు మోహరించినా ఫలితం లేకుండా పోయింది. నిరసనకారులు బారికేడ్లపైకి ఎక్కడానికి ప్రయత్నిస్తూ, బంగ్లాదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హిందూ రక్తం ప్రతి చుక్కకు లెక్క చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు.
