అహ్మదాబాద్ : ప్రపంచంలో టాప్ ప్లేయర్ గా గుర్తింపు పొందిన క్రికెటర్ విరాట్ కోహ్లీ. తను మైదానంలోకి వచ్చాడంటే పరుగుల వరద పారించడం మొదలు పెడతాడు. ఇది తనకు వెన్నతో పెట్టిన విద్య. ఈ ఏడాది 2026లో జరిగిన ఐపీఎల్ 19వ సీజన్ టైటిల్ ను రెండోసారి కైవసం చేసుకుంది రజత్ పాటిదార్ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ). అహ్మదాబాద్ వేదికగా జరిగిన కీలకమైన ఫైనల్ పోరులో ప్రత్యర్థి , ఆతిథ్య జట్టు గుజరాత్ టైటాన్స్ ను 5 వికెట్ల తేడాతో ఓడించింది. భారీ ప్రైజ్ మనీని చేజిక్కించుకుంది. ముందుగా బ్యాటింగ్ కు దిగింది గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 155 రన్స్ చేసింది. టాప్ ఆర్డర్ కు చుక్కలు చూపించారు ఆర్సీబీ బౌలర్లు. సలామ్ ధార్ 3 వికెట్లు కూల్చితే భువనేశ్వర్ కుమార్ 2 , హేజిల్ వుడ్ 2 వికెట్లు తీసి గుజరాత్ పతనాన్ని శాసించారు.
అనంతరం మైదానంలోకి దిగింది ఆర్సీబీ. ఆ జట్టు 5 వికెట్లు కోల్పోయి 156 రన్స్ చేసింది. 5 వికెట్లు కోల్పోయింది. ఇక జట్టుకు వెన్నుముకగా నిలిచాడు విరాట్ కోహ్లీ. తను కేవలం 42 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లు 3 సిక్సర్లతో 75 పరుగులు చేశాడు. తనకు తోడుగా వాషింగ్టన్ సుందర్ నిలిచాడు. తను 32 పరుగులు చేశాడు. ఈ సందర్బంగా మైదానంల గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ సాయి సుదర్శన్ తో విరాట్ కోహ్లీ వాగ్వావాదానికి దిగాడు. ఇద్దరి మధ్య తీవ్ర సంభాషణ చోటు చేసుకుంది. చివరకు అంపైర్ సంజ్ఞ చేయడంతో మాటల యుద్దానికి తెర పడింది.
