Vennamudda Krishna Interesting : చంద్రప్రభ వాహనంపై సిరుల తల్లి

వెన్న ముద్ద కృష్ణుడి అలంకారంలో

Hello Telugu - Vennamudda Krishna Interesting

Hello Telugu - Vennamudda Krishna Interesting

Vennamudda Krishna : తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజు అమ్మవారు వెన్న ముద్ద కృష్ణుడి (Vennamudda Krishna) అలంకారంలో చంద్రప్రభ వాహనంపై భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ఇచ్చారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతుండగా మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు అభయం ఇచ్చారు. రాత్రి 7 గంటల నుండి వాహనసేవ సాగింది. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పించి అమ్మ వారిని సేవించుకున్నారు.

Vennamudda Krishna Decoration Interesting

క్షీరసాగరంలో ఉద్భవించిన లక్ష్మికి చంద్రుడు సోదరుడు. పదహారు కళలతో ప్రకాశించే చంద్రప్రభ వాహనంపై ఊరేగుతున్న లక్ష్మీ శ్రీనివాసులపై దేవతలు పుష్పవృష్టి కురిపిస్తారని శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు వర్ణించారు. అటువంటి చంద్రప్రభ వాహనంపై విహరించే తనను సేవించే భక్తులపై ఆ చల్లని తల్లి కరుణా కటాక్షాలు పుష్పవృష్టిలాగా వర్షిస్తాయి.

వాహన సేవలో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ‌ర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ‌ర్ స్వామి, టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ దంపతులు, టిటిడి బోర్డు సభ్యులు ఎం. శాంతా రామ్, సివిఎస్వో కే.వి. మురళీకృష్ణ, ఆలయ డెప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Also Read : Agarkar-Gambhir Shocking Samson : శాంసన్ పై క‌క్ష క‌ట్టిన అగార్క‌ర్, గంభీర్

Exit mobile version