బీజేపీ బ‌లోపేతంపై దృష్టి సారించాలి

నితిన్ న‌బిన్ కు సూచించిన వెంక‌య్య

hellotelugu-NitinNabin

న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా భార‌తీయ జ‌న‌తా పార్టీ మ‌రింత బ‌లోపేతం అయ్యేందుకు కృషి చేయాల‌ని స్ప‌ష్టం చేశారు బీజేపీ మాజీ చీఫ్‌, మాజీ దేశ ఉప రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య నాయుడు. దేశ రాజ‌ధాని ఢిల్లీలోని త‌న నివాసంలో మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు నూత‌నంగా బీజేపీ జాతీయ కార్య నిర్వాహ‌క అధ్య‌క్షుడిగా నియ‌మితులైన బీహార్ రాష్ట్రానికి చెందిన మంత్రి నితిన్ న‌బిన్. ఆయ‌న‌కు సాద‌ర స్వాగ‌తం ప‌లికారు. ఈ సంద‌ర్బంగా కీల‌క అంశాల‌తో పాటు దేశంలో జ‌రుగుతున్న ప‌రిణామాల గురించి విస్తృతంగా చ‌ర్చించారు వెంక‌య్య నాయుడుతో . గ‌తంలో తాను పార్టీ చీఫ్ గా ప‌ని చేశాను. తాను ఎదుర్కొన్న ఇబ్బందులు, పార్టీ బ‌లోపేతం కోసం తాను చేప‌ట్టిన కార్య‌క్ర‌మాల గురించి నితిన్ న‌బిన్ కు వివ‌రించే ప్ర‌య‌త్నం చేశారు ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య నాయుడు.

పార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడిగా నా అనుభవాన్ని, పార్టీ నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడంపై నా ఆలోచనలను వివరంగా పంచుకున్నారు. ప్రజల‌తో పాటు పార్టీ కార్యకర్తల ఆకాంక్షలు నెరవేరేలా చూడటానికి దేశ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించాల‌ని సూచించారు. అంతే కాకుండా పార్టీ కార్యకర్తలతో నిరంతరం సంబంధాలు కొనసాగించడం చాలా అవసరమని నొక్కి వ‌క్కాణించారు. వెంక‌య్య నాయుడుతో భేటీ అనంత‌రం బీజేపీ జాతీయ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ నితిన్ న‌బిన్ మీడియాతో మాట్లాడారు. జ‌గ‌మెరిగిన అరుదైన నాయ‌కుడు వెంక‌య్య నాయుడు అని ఆయ‌న‌తో క‌ల‌వ‌డం ఆనందంగా ఉంద‌న్నారు. త‌న నుంచి ఎన్నో నేర్చుకోవాల్సిన‌వి ఉన్నాయ‌ని చెప్పారు. త‌ను ఇచ్చిన సూచ‌న‌ల‌ను తాను తూచ త‌ప్ప‌కుండా ఆచ‌రిస్తాన‌ని అన్నారు. పార్టీ బ‌లోపేతంపై ఫోక‌స్ పెడ‌తామ‌న్నారు.

Exit mobile version