Varun Chakaravarthy : ముంబై : ఇండియన్ స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (Varun Chakaravarthy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముంబైలో ఘనంగా జరిగింది సియట్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం. ఈ ఏడాది అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన పురుష క్రికెటర్లకు సంబంధించి పురస్కారాల కోసం ఎంపిక చేసింది. ఎవరూ ఊహించని రీతిలో టాప్ బ్యాటర్ గా నిలిచాడు కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్. తనకు సియట్ బ్యాటర్ ఆఫ్ ది ఇయర్ 2025గా ఎంపిక చేసింది. అంతే కాకుండా శాంసన్ తో పాటు భారత జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, శ్రేయాస్ అయ్యర్ , వరుణ్ చక్రవర్తి కూడా పురస్కారాలను అందుకున్నారు. ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్బంగా అవార్డు అందుకున్న అనంతరం జరిగిన చిట్ చాట్ సందర్బంగా వరుణ్ చక్రవర్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Varun Chakaravarthy Praises
తాను తిరిగి జట్టులోకి వస్తానని అనుకోలేదని చెప్పాడు. కెప్టెన్ సూర్య కుమార్, కోచ్ గౌతమ్ గంభీర్ నా వద్దకు వచ్చారు. జట్టులో నువ్వు కీలకమైన పాత్ర పోషించ బోతున్నావని, కేవలం ఆట మీదే ఫోకస్ పెట్టాలని సూచించారు. దీంతో వారు అందించిన సహకారం తో తాను దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా కప్ 2025లో కీలకమైన పాత్ర పోషించానని తెలిపాడు వరుణ్ చక్రవర్తి. తనకు ఊహించని రీతిలో మద్దతు లభించింది. దీంతో ఎలాంటి ఆందోళన చెందకుండానే నేను బౌలింగ్ దృష్టి సారించానని అన్నాడు. ఇక సంజూ శాంసన్ అయితే భారత దేశం కోసం ఆడటం గర్వంగా భావిస్తానని, ఇదే సమయంలో నెంబర్ 1 నుంచి 9వ స్థానం వరకు ఎక్కడ ఆడమన్నా ఆడేందుకు సిద్దంగా ఉన్నానని ప్రకటించాడు.
Also Read : Venkaiah Naidu Important Comments : ఉచితాలు కాదు అందరికీ విద్య, వైద్యం అందాలి



















