Vangalapudi Anitha Clear Instructions : ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాలి : అనిత

మ‌త్స్య‌కారులు వేటకు వెళ్ల‌వ‌ద్దు

Hello Telugu - Vangalapudi Anitha Clear Instructions

Hello Telugu - Vangalapudi Anitha Clear Instructions

Vangalapudi Anitha : అమరావతి : బంగాళా ఖాతంలో ఏర్ప‌డిన అల్ప పీడ‌నం ప్ర‌భావం కార‌ణంగా ఏపీ లో పెద్ద ఎత్తున వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఇప్ప‌టికే అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని రాష్ట్ర స‌ర్కార్ కు సూచించింది రాష్ట్ర విప‌త్తుల నిర్వ‌హ‌ణ‌, వాతావ‌ర‌ణ శాఖ‌. ఈ మేర‌కు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు సద‌రు సంస్థ ఎండీ ప్ర‌ఖ‌ర్ జైన్. దీంతో ముందు జాగ్ర‌త్త‌గా సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఆదేశాల మేర‌కు రాష్ట్ర విప‌త్తుల నిర్వ‌హ‌ణ‌, హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత (Vangalapudi Anitha) అల‌ర్ట్ అయ్యారు. ఈ మేర‌కు ఆమె అత్య‌వ‌స‌ర స‌మావేశం నిర్వ‌హించారు. ఆయా జిల్లా క‌లెక్ట‌ర్లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఆదేశించారు. ఎక్క‌డా ఎవ‌రికీ ఇబ్బంది లేకుండా చూడాల‌ని స్ప‌ష్టం చేశారు.

Home Minister Vangalapudi Anitha Clear Instructions

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, తుఫాన్ ప్రభావం పై హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత, జలవనురుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ విజయలక్ష్మి, జిల్లా కలెక్టర్లు ,రెవెన్యూ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్ అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులు, పంటలు, నీటిపారుదల నిర్మాణాల భద్రత కోసం అప్రమత్తంగా పనిచేయాల‌ని స్పష్టం చేశారు. రిజర్వాయర్స్, చెరువులు, బ్యారేజీలు, వాగులు అన్నింటి పై రౌండ్ ది క్లాక్ మానిటరింగ్ ఉండాలన్నారు .ప్రతి గంట ఇన్ఫ్లో, అవుట్ ఫ్లో వివరాలు కంట్రోల్ రూమ్ కి పంపాలని ఆదేశించారు. జిల్లా కలెక్టరు, ఇరిగేషన్, రెవెన్యూ, పోలీస్, విద్యుత్, ఆర్ అండ్ బి, పంచాయతీ శాఖలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. నీటి విడుదల చేయాల్సిన పరిస్థితి వస్తే క్రింది గ్రామాలకు సమాచారం ఇవ్వాలన్నారు.

Also Read : Ex CM YS Jagan Shocking : ఓల్వో బ‌స్సు ద‌గ్ధం జ‌గ‌న్ రెడ్డి సంతాపం

Exit mobile version