Minister Atchannaidu Important Update : ఆక్వా రంగ అభివృద్ధికి లోకేష్ కృషి ప్ర‌శంస‌నీయం

రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మ‌త్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు

Hello Telugu - Minister Atchannaidu Important Update

Hello Telugu - Minister Atchannaidu Important Update

Minister Atchannaidu : అమ‌రావ‌తి : రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మ‌త్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ను ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు. ప్ర‌స్తుతం ఆస్ట్రేలియాలో ప‌ర్య‌టిస్తున్నారు లోకేష్. ఈ సందర్భంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆస్ట్రేలియాతో ఆక్వా బంధం కొత్త అవకాశాలకు దారి తీయనుందని అన్నారు. ఏపీ ఆక్వా ఉత్పత్తుల నాణ్యత పెంపు, ఎగుమతులకు మంత్రి నారా లోకేష్ అత్య‌ధికంగా ప్రాధాన్య‌త ఇచ్చార‌ని అన్నారు. గురువారం అఅచ్చెన్నాయుడు (Minister Atchannaidu) మీడియాతో మాట్లాడారు. అమెరికా విధించిన అధిక సుంకాలకు ప్రత్యామ్నాయంగా ప్రపంచ వ్యాప్తంగా ఏపీ ఆక్వా ఉత్పత్తులకు కొత్త మార్కెట్లు కల్పించాలనే లక్ష్యంగా ప్ర‌భుత్వం పెట్టుకుంద‌న్నారు. ఆస్ట్రేలియా లో ఏపీ ఆక్వా రైతుల అభివృద్ధి కోసం ప్ర‌య‌త్నం చేయ‌డం ప‌ట్ల మంత్రి లోకేష్ ను అభినందించారు అచ్చెన్నాయుడు.

Minister Atchannaidu Praises Nara Lokesh

ఆయ‌న‌కు రాష్ట్రం ప‌ట్ల‌, రైతుల ప‌ట్ల‌, ముఖ్యంగా ఆక్వా కు సంబంధించి త‌న‌కు ఉన్న నిబ‌ద్ద‌త గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. ప్రాసెసింగ్, కోల్డ్ చైన్, ప్యాకేజింగ్ రంగాల్లో ఆధునిక సాంకేతికతకు ప్రోత్సాహం క‌ల్పించాల‌ని ఈ సంద‌ర్భంగా లోకేష్ ఆస్ట్రేలియా ప్ర‌భుత్వాన్ని కోరార‌ని , అందుకు అక్క‌డి స‌ర్కార్ పూర్తి స‌హ‌కారం అందిస్తామ‌ని చెప్ప‌డం మ‌రింత ఆనందం క‌లిగించింద‌న్నారు కింజ‌రాపు అచ్చెన్నాయుడు ఏపీ సీ ఫుడ్ బ్రాండ్‌కి అంతర్జాతీయ గుర్తింపు తేవాలన్న లోకేష్ సంకల్పం అద్భుత‌మ‌న్నారు. ఇక దేశంలోనే అత్యంత స‌మ‌ర్థుడైన నాయ‌కుడు త‌మ‌కు ఉన్నాడ‌ని, ఇది ఏపీ రాష్ట్ర ప్ర‌జ‌లు చేసుకున్న పుణ్య‌మ‌ని పేర్కొన్నారు. చంద్రబాబు నాయకత్వంలో పెట్టుబడుల వర్షం కురుస్తోందని చెప్పారు. రాష్ట్రానికి 1,000 కిమీ సముద్ర తీరం ఉండ‌డం ఆక్వా పరిశ్రమకు బలమైన ఆధారంగా ఉంద‌న్నారు నైపుణ్యాభివృద్ధి, పరిశోధన, సాంకేతిక రంగాల్లో లోకేష్ ప్రగతిశీల ఆలోచ‌న‌లు అభినంద‌నీయ‌మ‌న్నారు.

Also Read : Simhagiri Karthikas Presence Interesting : సింహగిరి ఆల‌య‌ స‌న్నిధిలో కార్తీక సందడి

Exit mobile version