Cinema Workers Fired on Vallabhaneni Anil : చిత్రపురిలో 300 కోట్ల స్కాం..సినీ కార్మికుల ఆగ్ర‌హం

సొసైటీ అధ్య‌క్షుడు వ‌ల్ల‌భ‌నేని అనిల్ కుమార్ పై ఫైర్

Hello Telugu - Cinema Workers Fired on Vallabhaneni Anil

Hello Telugu - Cinema Workers Fired on Vallabhaneni Anil

Vallabhaneni Anil : హైదరాబాద్: చిత్రపురి హౌసింగ్ సొసైటీలో సుమారు రూ. 300 కోట్ల రూపాయల మేర భారీ కుంభకోణం జరిగిందని, సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ (Vallabhaneni Anil) ఆధ్వర్యంలో అవినీతి పెరిగి పోతోందని ఆరోపిస్తూ పలువురు సినీ కార్మికులు, నాయకులు ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కార్యాలయం ముందు బుధవారం మహాధర్నా చేపట్టారు. నిజమైన సినిమా కార్మికులకు ఇళ్లు దక్కకుండా అన్యాయం చేస్తున్నారని, ఫ్లాట్లను బ్లాక్ మార్కెట్‌లో కోట్లకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. వల్లభనేని అనిల్ కుమార్‌ను తక్షణమే అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు.

Cinema Workers Fired on Vallabhaneni Anil Kumar

ఈ సందర్భంగా చిత్రపురి పోరాట సమితి, సీఐటీయూ నాయకులు మాట్లాడారు. కార్మికుల కోసం కేటాయించిన స్థలంలో వారిని మోసం చేసే కుట్ర జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. చిత్రపురిలో మిగిలిన 2.5 ఎకరాలలో, కార్మికులు అడుగుతున్న సింగిల్, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను కాదని, 1200 నుండి 4400 చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ నిర్మాణాలు చేపట్టార‌ని, వాటిని బయటి వ్యక్తులకు అమ్ము కోవడానికి కమిటీ ప్లాన్ చేసింద‌న్నారు. ఇందుకు హెచ్ ఎం డీఏ , సీఎంఓ కార్యాలయ అధికారులతో కుమ్మక్కై అక్రమాలకు పాల్పడుతున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్‌పై ఇప్పటికే 15 FIRలు, 10 ఛార్జ్‌షీట్‌లు నమోదయ్యాయని, రెండు సార్లు జైలుకు వెళ్లి వచ్చినా తన అక్రమాలు ఆపడం లేదని ఆరోపించారు. తెలంగాణ ఉన్నత న్యాయస్థానం రిట్ పిటిషన్ నెం. 18225/2021, 7642/2024, 9335/2025 ద్వారా ప్రస్తుత కమిటీపై చర్యలు తీసుకోవాలని ఆదేశించినా, అధికారులు పట్టించుకోవడం లేదంటూ వాపోయారు. దీనివల్లే అనిల్ కుమార్ అవినీతికి అడ్డు లేకుండా పోయిందని వారు మండిపడ్డారు. ఇప్ప‌టి కాంగ్రెస్ స‌ర్కార్ కూడా ప‌ట్టించ‌చుకోక పోవ‌డం దారుణ‌మ‌న్నారు.

Also Read : Popular Actress Lavanya Tripathi : అల‌రిస్తున్న లావ‌ణ్య చిత్తూరు పిల్ల

Exit mobile version