జైపూర్ : రాజస్థాన్ రాయల్స్ జట్టుకు వెన్నుముకగా మారాడు యంగ్ క్రికెట్ స్టార్ వైభవ్ సూర్యవంశీ. తనలోని టాలెంట్ ను గమనించి, ప్రోత్సహించాడు ఒకప్పటి ఆ జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్. తను వచ్చీ రావడంతోనే సత్తా చాటాడు. ప్రపంచ క్రికెట్ లో కొత్త చరిత్రకు నాంది పలికాడు. అతి పిన్న వయసులో రికార్డులను తిరగ రాశాడు. ఐపీఎల్ 19వ సీజన్ లో ఏకంగా తను ప్రాతినిధ్యం వహిస్తున్న రాజస్థాన్ జట్టుకు మూలస్తంభంగా మారాడు. ఆ జట్టు విజయాలలో కీలక పాత్ర పోషించాడు. అంతే కాదు ఐపీఎల్ లో అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్ గా పేరు పొందాడు. రికార్డు బ్రేక్ చేశాడు. ఈ సందర్బంగా ఎలిమినేటర్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు బౌలర్లను ఉతికి ఆరేశాడు. చుక్కలు చూపించాడు. కళ్లు చెదిరే షాట్స్ తో ఉరికించాడు. కేవలం 29 బంతులు ఆడి 5 ఫోర్లు 12 సిక్సర్లతో విద్వంసం సృష్టించాడు. దీంతో ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది.
మ్యాచ్ అనంతరం ఎవరూ ఊహించని విధంగా వైభవ్ సూర్య వంశీ ప్రముఖ క్రికెటర్, కామెంటేటర్ సునీల్ మనోహర్ గవాస్కర్ పాదాలకు నమస్కరించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. ఈ సందర్బంగా గవాస్కర్ స్పందించాడు. వైభవ్ సూర్యవంశీ కేవలం ఒక గొప్ప ఆటగాడు మాత్రమే కాదు, అంతకంటే గొప్ప మానవతావాది. నిన్న, మ్యాచ్ ప్రారంభానికి ముందు, మైదానంలో జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో మేము ఉన్నప్పుడు, వైభవ్ సూర్యవంశీ దూరం నుండి మా వైపు పరుగెత్తుకుంటూ వచ్చి, గౌరవ సూచకంగా మా పాదాలకు నమస్కరించాడు. ఇంతకు ముందు ఏ ఆటగాడూ ఇలా చేయడం నేను ఎప్పుడూ చూడలేదు. అతను తన సీనియర్లను గౌరవించే తీరు నిజంగా ప్రశంసనీయం; దీనికి అతని పెంపకం. విలువలే కారణం. అతని ప్రవర్తన నన్ను నిజంగా ఎంతగానో కదిలించింది. భవిష్యత్తులో అతను మరింత గొప్ప ఆటగాడిగా ఎదుగుతాడని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానని అన్నాడు.
