Black Mold Onion : ఉల్లిపాయలు మన వంటల్లో ముఖ్యమైన పదార్థం. ఇవి లేకుండా చాలామంది వంట రుచిని ఊహించలేరు. కానీ మీ వంటగదిలో ఉన్న ఉల్లిపాయలపై నల్ల మచ్చలు (Black Mold Onion) లేదా బూజు (ఫంగస్) ఉంటే, అలాంటి ఉల్లిపాయలు ఆరోగ్యానికి హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాంటి ఉల్లిపాయలు మీ జీర్ణవ్యవస్థను దెబ్బతీయడమే కాకుండా, తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
Black Mold Onion – నల్ల మచ్చల కారణంగా కలిగే ప్రమాదాలు
నల్ల మచ్చలు ఉన్న ఉల్లిపాయల్లో (Black Mold Onion) మైకోటాక్సిన్ అనే విషపదార్థాలు ఏర్పడతాయి. ఇవి శరీరంలోకి వెళ్లినప్పుడు ఫుడ్ పాయిజనింగ్, వాంతులు, కడుపు నొప్పి, విరేచనాలు వంటి సమస్యలకు కారణమవుతాయి. దీర్ఘకాలంగా ఈ రకమైన ఉల్లిపాయలను తీసుకుంటే లివర్ సమస్యలు, ఆలర్జీలు లేదా క్యాన్సర్‌కు దారితీయే అవకాశమూ ఉన్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఉల్లిపాయలపై నల్ల మచ్చలు కనిపిస్తే అవి ఎలాగైన వినియోగించకుండా పారవేయడం ఉత్తమం.
తాజా ఉల్లిపాయలే ఆరోగ్య రహస్యం
తాజా ఉల్లిపాయల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు శరీరానికి మేలు చేస్తాయి. ఇవి రోగనిరోధక శక్తిని మెరుగుపరిచేలా, గుండె ఆరోగ్యాన్ని కాపాడేలా, రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రించేలా సహాయపడతాయి. ఈ కారణంగా ఆరోగ్య నిపుణులు ఎప్పుడూ తాజా మరియు శుభ్రమైన ఉల్లిపాయలను మాత్రమే వాడాలని సూచిస్తున్నారు.
నల్ల మచ్చలు రాకుండా ఎలా జాగ్రత్తపడాలి?
ఉల్లిపాయలను సరైన ప్రదేశంలో నిల్వ చేయడం చాలా ముఖ్యం. వీటిని:
- తేమలేని పొడి ప్రదేశాల్లో
- గాలి త్రాపుగా ఉండే బుట్టలలో
- ఫ్రిజ్‌లో కాకుండా గది ఉష్ణోగ్రత వద్ద
- నేరుగా భూమికి తగలకుండా నిల్వ చేయాలి
వర్షాకాలంలో ఫంగస్ వ్యాప్తి అధికంగా ఉండటంతో, ఒకేసారి ఎక్కువ ఉల్లిపాయలు కొని నిల్వ చేసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. అవసరానికి తగ్గట్టుగా కొనడం మంచిది.
నల్ల మచ్చలతో ఉన్న ఉల్లిపాయలను వాడడం ఆరోగ్యానికి ప్రమాదకరం అని గుర్తుంచుకోండి. అలాంటి ఉల్లిపాయలను శుభ్రంగా కడిగినా, వేపినా, ముక్కలు చేసినా ప్రమాదం తప్పదు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే, నాణ్యమైన, తాజా ఉల్లిపాయల వాడకానికే ప్రాధాన్యం ఇవ్వాలి.
Also Read : Corn Interesting Facts : మొక్కజొన్న ప్రతి గింజలోను క్యాలరీలు ఉంటాయా?



















