JD Vance : అమెరికా : తన భార్య ఉష మతం మారుతోందంటూ జరుగుతున్న ప్రచారంపై స్పందించారు అమెరికా దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (JD Vance). ఆమె క్రైస్తవురాలు కాదని, మతం మారే ఆలోచన లేదని స్పష్టం చేశారు. నా మతాంతర వివాహం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఇది అసంబద్దమైదని, మంచి పద్దతి కాదన్నారు వాన్స్. ఉష భారతీయ సంతతికి చెందిన మహిళ. తన స్వస్థలం ఏపీ. ఈ విషయాన్ని వాన్స్ వైస్ ప్రెసిడెంట్ గా గెలుపొందిన సమయంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆపై వివరాలు కూడా తెలియ చేశారు. అమెరికాలో ఎక్కువగా ప్రవాస భారతీయుల సంఖ్య ఉంటుంది. వీరిలో అత్యధికంగా తెలుగు వారు ఉంటారు. ఇది జగమెరిగిన సత్యం.
US Vice President JD Vance Comments
ఇటీవలే జేడీ వాన్స్ భార్య ఉషా వాన్స్ మతం మార్చుకునే ప్రయత్నం చేస్తోందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీనిపై తీవ్రంగా ఖండించారు వాన్స్. తాను ప్రస్తుతం బాధ్యత కలిగిన ఉపాధ్యక్ష పదవిలో ఉన్నానని, దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత తనపై ఉంటుందన్నారు. తాను ప్రతి ఒక్కరి ఆలోచనలను, వారి ఆచారాలను , సంస్కృతిని గౌరవిస్తానని స్పష్టం చేశారు. అయితే తమ పిల్లలను తను చర్చికి పంపిస్తుందని తెలిపారు. ఇందులో ఎలాంటి అనుమానం లేదన్నారు. ఎవరి అభిప్రాయాలు వారివని పేర్కొన్నారు జేడీ వాన్స్. ఎవరి మతం వారిదే, ఎవరి వ్యక్తిగత జీవితం వారిదే. అలాగని ఇంకొకరి మతం గురించి, వ్యక్తిగత విషయాల గురించి ప్రస్తావించడం మంచిది కాదని సూచించారు.
Also Read : Azharuddin Growth As a Minister : ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్స్ : అజహరుద్దీన్















