Donald Trump : అమెరికా : పెద్దన్న అమెరికా దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సీరియస్ అయ్యారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వాషింగ్టన్ చేసిన హెచ్చరికలను ధిక్కరించారు. అణ్వాయుధ సామర్థ్యం గల, అణ్వాయుధ శక్తితో నడిచే నీటి అడుగున డ్రోన్‌ను మాస్కో విజయవంతంగా పరీక్షించిందని ప్రకటించారు అధ్యక్షుడు. దీంతో తీవ్రంగా స్పందించారు ట్రంప్. తక్షణమే అమెరికా సైతం అణ్వాయుధాలను పరీక్షించాలని ఆదేశించారు. ఆయన చేసిన తాజా ప్రకటన కలకలం రేపింది. చైనా నాయకుడు జి జిన్‌పింగ్‌తో అధిక వాటాల శిఖరాగ్ర సమావేశాన్ని ప్రారంభించడానికి కొన్ని నిమిషాల ముందు ఈ కీలక ప్రకటన చేశారు ట్రంప్.
Donald Trump Shocking Comments
ఇతర దేశాలు కార్యక్రమాలను పరీక్షిస్తున్నందు వల్ల తమ అణ్వాయుధాలను సమాన ప్రాతిపదికన పరీక్షించడం ప్రారంభించాలని తమ దేశంలోని యుద్ధ శాఖను ఆదేశించడం జరిగిందని స్వయంగా చెప్పారు అమెరికా దేశ అధ్యక్షుడు. ఇదే విషయాన్ని అధికారికంగా తన సోషల్ మీడియా ట్రూత్ లో కూడా పోస్ట్ చేశారు. ఈ సందర్బంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. రష్యా రెండవ స్థానంలో ఉంది, చైనా మూడవ స్థానంలో ఉంది, కానీ ఐదు సంవత్సరాలలోపు కూడా ఉంటుందంటూ పేర్కొన్నారు ట్రంప్. ఓ వైపు అపెక్ శిఖరాగ్ర సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇదిలా ఉండగా ఆసియా పసిఫిక్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్న ట్రంప్ మరోసారి భారత దేశంపై నోరు పారేసుకున్నారు. తన వల్లనే భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య యుద్దం ఆగి పోయిందన్నారు. తాను గనుక జోక్యం చేసుకోక పోతే పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం జరిగి ఉండేదన్నారు. మొత్తంగా మోదీ తనకు అత్యంత ఆప్తుడని, అంతకు మించిన నమ్మకమైన స్నేహితుడని కొనియాడారు.
Also Read : Rohit Sharma Growth : ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో రోహిత్ శర్మ టాప్















