US Warning : ఇలా చేస్తే మీ వీసా రద్దు చేస్తామంటున్న అమెరికా

US వీసాలకు అనర్హత వంటి చర్యలు ఉండవచ్చని పేర్కొంది...

Hello Telugu - US Warning

Hello Telugu - US Warning

US : భారతీయ విద్యార్థులకు అమెరికా రాయబార కార్యాలయం కొత్త హెచ్చరికను జారీ చేసింది. అమెరికా చట్టాలను ఉల్లంఘించినా, అదుపులోకి తీసుకున్నా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. ఇందులో వీసా రద్దు, దేశం నుంచి బహిష్కరణ, భవిష్యత్తులో US వీసాలకు అనర్హత వంటి చర్యలు ఉండవచ్చని పేర్కొంది.

“అమెరికా (US) చట్టాలు మీ విద్యార్థి వీసాపై నేరుగా ప్రభావం చూపుతాయి. అరెస్టు అయినా లేదా నియమాలను ఉల్లంఘించినా వీసా రద్దు అయ్యే అవకాశం ఉంది. అలాగే మిమ్మల్ని బహిష్కరించవచ్చు, భవిష్యత్తులో వీసాలు పొందే అవకాశాలు కోల్పోవచ్చు. కాబట్టి నియమాలను పాటించండి, మీ ప్రయాణాన్ని ప్రమాదంలో పెట్టొద్దు. వీసా అనేది హక్కు కాదు, ఒక ప్రత్యేక అనుమతి మాత్రమే” అని రాయబార కార్యాలయం ‘X’లో పేర్కొంది.

ఇటీవలి కాలంలో రాయబార కార్యాలయం మరొక హెచ్చరిక జారీ చేసి, అమెరికాలో అనుమతించిన కాలం కంటే ఎక్కువ రోజులు ఉంటే దేశం నుంచి బహిష్కరణ తప్పదని, తిరిగి ప్రవేశం శాశ్వతంగా నిషేధించబడవచ్చని స్పష్టం చేసింది.

US – కొత్త నిబంధనలు

ఆగస్టు 1 నుంచి US వీసా దరఖాస్తు కేంద్రాల్లో థర్డ్ పార్టీ ద్వారా పాస్‌పోర్ట్ సేకరణ నిషేధించబడింది. 18 ఏళ్లలోపు మైనర్లు అనర్హులుగా పరిగణించబడ్డారు. అయితే తల్లిదండ్రులు లేదా సంరక్షకులు పిల్లల తరపున పాస్‌పోర్ట్ తీసుకోవచ్చు. దీనికి తల్లిదండ్రులిద్దరి సంతకాలు చేసిన అధికార లేఖ తప్పనిసరి. ఇమెయిల్ లేదా స్కాన్ కాపీలు మాత్రం అంగీకరించరని స్పష్టం చేసింది.

దరఖాస్తుదారులు తమ పాస్‌పోర్ట్‌ను నేరుగా ఇంటికి లేదా కార్యాలయానికి పంపించుకునే సౌకర్యాన్ని కూడా రాయబార కార్యాలయం ప్రారంభించింది. ఈ సేవకు రూ.1,200 రుసుము ఉంటుంది. దరఖాస్తుదారులు ustraveldocs.com వెబ్‌సైట్‌లో తమ ఖాతా ద్వారా డెలివరీ సెట్టింగ్‌లు మార్చుకోవాలి.

ఇంటర్వ్యూ మినహాయింపులో మార్పులు

సెప్టెంబర్ 2, 2025 నుంచి ఇంటర్వ్యూ మినహాయింపు అవకాశాలు గణనీయంగా తగ్గించబడ్డాయి. H, L, F, M, J, E, O వర్గాల వీసాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇకపై నేరుగా ఎంబసీ లేదా కాన్సులేట్‌కి వెళ్లవలసి ఉంటుంది.

అదనంగా, వయస్సు ఆధారంగా ఇచ్చే మినహాయింపులు రద్దు చేశారు. అంటే 79 ఏళ్లు పైబడినవారు, 14 ఏళ్లలోపు పిల్లలు కూడా తప్పనిసరిగా ఇంటర్వ్యూకి హాజరు కావాలి. అయితే A-1, A-2, కొన్ని C-3 వీసాలు, TECRO E-1, G మరియు NATO వీసాలు ఈ మార్పులకు అతీతంగా ఉంటాయి.

ఇక వీసా రుసుము చెల్లింపు తర్వాత 365 రోజుల వరకు చెల్లుబాటు అవుతుందని, అపాయింట్‌మెంట్ బుకింగ్ విధానం, అవసరమైన పత్రాల జాబితా యథావిధిగా కొనసాగుతుందని రాయబార కార్యాలయం స్పష్టం చేసింది.

Also Read : Google Shocking : 250 కోట్ల జిమెయిల్ అకౌంట్ లు ప్రమాదంలో పెట్టిన గూగుల్ సంస్థ

Exit mobile version