Minister Kiren Rijiju Fired on Rahul Gandhi : రాజ్యాంగం అంటే రాహుల్ కు లెక్క‌లేదు

కేంద్ర మంత్రి కిర‌ణ్ రిజిజు షాకింగ్ కామెంట్స్

Hello Telugu - Minister Kiren Rijiju Fired on Rahul Gandhi

Hello Telugu - Minister Kiren Rijiju Fired on Rahul Gandhi

Kiren Rijiju : ఢిల్లీ – కేంద్ర మంత్రి కిర‌ణ్ రిజిజు షాకింగ్ కామెంట్స్ చేశారు ఎంపీ రాహుల్ గాంధీపై. ఆయ‌న ప‌దే ప‌దే రాజ్యాంగం గురించి ప్ర‌స్తావిస్తూ హ‌ల్ చ‌ల్ చేస్తున్నార‌ని, కానీ నిజానికి పూర్తిగా రాజ్యాంగం చ‌దివితే ఇలా మాట్లాడ‌రంటూ ఎద్దేవా చేశారు. ఆయ‌న‌కు కానిస్టిట్యూష‌న్ ప‌ట్ల గౌర‌వం లేద‌న్నారు. గురువారం కేంద్ర మంత్రి రిజిజు (Kiren Rijiju) మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌లో చాలా మంది తెలివైన వ్యక్తులు, నాయ‌కులు ఉన్నారని క‌నీసం వారైనా రాహుల్ గాంధీకి నేర్పిస్తే బావుంటుందంటూ సూచించారు. ప‌దే ప‌దే కేంద్ర ఎన్నిక‌ల సంఘాన్ని, కేంద్ర స‌ర్కార్ ను ఇరుక‌న పెట్ట‌డం త‌ప్పితే రాహుల్ గాంధీ వ‌ల్ల సాధించింది ఏమిటి అని ప్ర‌శ్నించారు. రోజు రోజుకు ఆయ‌న ఏం మాట్లాడుతున్నారో త‌న‌కే అర్థం కావ‌డం లేద‌న్నారు.

Union Minister Kiren Rijiju Slams Rahul Gandhi

ఇవాళ సుప్రీంకోర్టు సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. బీహార్ లో ఏకంగా 65 ల‌క్ష‌ల ఓట్లు తొల‌గించ‌డం ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ ఏడీఆర్ తో పాటు ప్ర‌శాంత్ భూష‌ణ్, యోగేంద్ర యాద‌వ్ , సింఘ్వీ పిటిష‌న్లు దాఖ‌లు చేశారు. దీనిపై సుదీర్ఘ విచార‌ణ చేప‌ట్టింది కోర్టు. ఈ సంద‌ర్బంగా మొత్తం ఓట్ల జాబితాను కేంద్ర ఎన్నిక‌ల సంఘం వెబ్ సైట్ లో ప్ర‌చురించాల‌ని ఆదేశించింది. దీనిపై కాంగ్రెస్ సుప్రీంకోర్టు నిర్ణ‌యాన్ని స్వాగ‌తించింది. కాగా కిర‌ణ్ రిజిజు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఎన్నిక‌ల‌ కమిషన్‌కు 3-4 మార్గదర్శకాలు ఉన్నాయి. ప్రతి రాష్ట్రంలో, రాష్ట్ర ప్రభుత్వం కింద ఎన్నికల కమిషనర్ అధికారులు ఉన్నారు. వారు EC తరపున ఓటర్ల జాబితాను సిద్ధం చేస్తారని ఆ విష‌యం తెలుసుకోకుండా చేస్తే ఎలా అని ప్ర‌శ్నించారు కేంద్ర మంత్రి.

Also Read : Supreme Court Shocking to EC : 65 ల‌క్ష‌ల ఓట‌ర్ల జాబితా వెల్ల‌డించాలి

Exit mobile version