న్యూఢిల్లీ : కేంద్ర టెలికమ్యూనికేషన్స్ శాఖ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ సీరియస్ గా స్పందించారు. బుధవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. కొందరు కావాలని తాము తీసుకు వచ్చిన సంచార్ సాథి యాప్ పై లేనిపోని ఆరోపణలు, అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. అదంతా తప్పు అని పేర్కొన్నారు. సంచార్ సాథి యాప్ పై ప్రతిపక్షాల అనుమానం చెప్పడాన్ని తప్పు పట్టారు పెమ్మసాని చంద్రశేఖర్. ఇది స్నూపింగ్ యాప్ అని చెప్పడం మంచి పద్దతి కాదన్నారు. ఎవరైనా దయచేసి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని తాను కోరుతున్నానని చెప్పారు కేంద్ర మంత్రి. దీన్ని మీరే ఒకసారి వాడి చూడాలని సూచించారు. సైబర్ మోసాన్ని నివారించడానికి కొన్ని మార్గాలు మాత్రమే ఉన్నాయని అన్నారు . నా దృష్టిలో, ఇది బహుశా ఏకైక మార్గం మాత్రమే ఉందన్నారు పెమ్మసాని చంద్రశేఖర్.
సంచార్ సాథి యాప్ ను ముందస్తుగా ఇన్‌స్టాల్ చేయవచ్చా లేదా అనేది వేరే కథ అని అన్నారు. ఆ ఆర్డర్‌ను తిరిగి పరిశీలిస్తామని ప్రభుత్వం, సింధియా ఇప్పుడే వివరించారని తెలిపారు. విద్యావంతుల నుండి సమాచారాన్ని సేకరించి పేదలకు, వృద్ధులకు సహాయం చేయడానికి దీనిని ఉపయోగించడం ఈ యాప్ లక్ష్యం అని స్పష్టం చేశారు పెమ్మసాని చంద్రశేఖర్. అందుకే ఇది అన్ని స్థానిక భాషలలో పని చేస్తుందన్నారు. తాము దీనిని కష్టపడి తయారు చేశామన్నారు. మీరు గనుక వెబ్‌సైట్‌ను చూస్తే, ఈ వెబ్‌సైట్, సంచార్ సథికి దాదాపు 20 కోట్ల వెబ్‌సైట్ హిట్‌లు వస్తున్నాయని చెప్పారు. అంతే కాకుండా ఏకంగా 1.4 కోట్ల మంది ఇప్పటికే ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారని తెలిపారు. ఈ యాప్ వల్ల నష్టం ఏమీ లేదన్నారు.
















