UN Security Council : అమెరికా : ఐక్య రాజ్య సమితి కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు యుఎన్ భద్రతా మండలి తీపి కబురు చెప్పింది ఆఫ్గనిస్తాన్ దేశానికి. అక్టోబర్ 9వ తేదీ నుండి 16వ తేదీ వరకు భారత దేశాన్ని సందర్శించేందుకు తమకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరింది ఆఫ్గనిస్తాన్ సర్కార్. ప్రపంచంలో ఈ దేశానికి పూర్తిగా మద్దతు ఇస్తూ వస్తోంది గత కొంత కాలంగా . అయితే ఇంకా ఐక్య రాజ్య సమితి (UN Security Council) గుర్తించ లేదు. ప్రజాస్వామ్య బద్దంగా ఆఫ్గనిస్తాన్ లో ప్రభుత్వం ఏర్పాటు కాలేదని దీనికి కారణం చెప్పింది. తాజాగా ఇండియాలో పర్యటించేందుకు తమ దేశానికి చెందిన విదేశాంగ శాఖ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి అనుమతి ఇవ్వాల్సిందిగా విన్నవించింది. ఈ మేరకు యుఎన్ లో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్న బారత దేశంలో పర్యటించేందుకు తాజాగా అనుమతి ఇస్తున్నట్లు వెల్లడించింది.
UN Security Council Approved
ప్రయాణ నిషేధ మినహాయింపులను యుఎన్ ఆమోదించడం విశేషం. భద్రతా మండలి తీర్మానం 1988 (2011) ప్రకారం తాలిబాన్‌తో సంబంధం ఉన్న కొంతమంది వ్యక్తులు ప్రయాణ నిషేధాలకు లోబడి ఉంటారు. అయితే ఈ తీర్మానం కౌన్సిల్ అధికారిక విధులు లేదా వైద్య కారణాల కోసం మినహాయింపులు మంజూరు చేయడానికి అనుమతిస్తుంది. అఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి ఇండియాలో పర్యటించేందుకు తాత్కాలికంగా పర్మిషన్ ఇచ్చినట్లు స్పష్టం చేసింది. సెప్టెంబర్ 30 న, 1988 (2011) తీర్మానం ప్రకారం ఏర్పాటు చేసిన భద్రతా మండలి కమిటీ అమీర్ ఖాన్ మోతాకి (TAI. 026) ఓకే చెప్పినట్లు తెలిపింది ఐక్య రాజ్య సమితి.
Also Read : India Govt Interesting Update : 11 రాష్ట్రాలలో 550 పత్తి కొనుగోలు కేంద్రాలు


















