ర‌ష్యా అధ్య‌క్షుడిపై ఉక్రెయిన్ చీఫ్ ఆగ్ర‌హం

ఇత‌ర దేశాల పౌరుల‌తో యుద్ద క్షేత్రంలోకి

hellotelugu-Zelensky

ఉక్రెయిన్ : రష్యా ప్ర‌భుత్వంపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు ఉక్రెయిన్ చీఫ్ జెలెన్ స్కీ. రష్యా తన పౌరులను నియమించు కోవడాన్ని ఆపాలని భారత్, 47 దేశాలకు జెలెన్స్కీ విజ్ఞప్తి చేశారు. రష్యా పలు దేశాల నుండి పౌరులను నియమించుకుని వారిని యుద్ధ క్షేత్రానికి పంపుతోందని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరిగిన 81వ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ప్రసంగించారు. రష్యా ఈ సంఘర్షణలో విదేశీ పౌరులను వాడుకుంటోందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మోసం , కుతంత్రాల ద్వారా తమ పౌరులు రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలోకి లాగబడకుండా నిరోధించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు భారత్‌తో పాటు 47 దేశాలను కోరారు. రష్యా పలు దేశాల నుండి పౌరులను నియమించుకుని వారిని యుద్ధ క్షేత్రానికి పంపుతోందని జెలెన్స్కీ అన్నారు.

వారు ఈ సంఘర్షణలో ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన అన్నారు. రష్యా తన యుద్ధంలో 47 దేశాల పౌరులను ఉపయోగిస్తుందని మనకు తెలుసు. ఘనా, నేపాల్, తజికిస్తాన్, భారతదేశం, యెమెన్, కెన్యా, జింబాబ్వే, క్యూబా, బెలారస్, సూడాన్, దక్షిణాఫ్రికా, ఇంకా అనేక ఇతర దేశాలు… యుద్ధభూమిలో రష్యన్లు కాని వారు కూడా చనిపోవడాన్ని మనం చూస్తున్నామని పేర్కొన్నారు. మీ దేశాలకు చెందిన, 47 దేశాలకు చెందిన ప్రజలు, మోసం , కుతంత్రాల ద్వారా రష్యాలో చిక్కుకున్నార‌ని మండిప‌డ్డారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకారం 227 మంది భారతీయులు రష్యా సాయుధ దళాలలో చేరారు, వారిలో 139 మందిని తొలగించగా, 51 మంది మరణించారు. అక్కడ ఉన్న వారి విడుదల కోసం, స్వదేశానికి రప్పించడం కోసం న్యూఢిల్లీ మాస్కోతో నిరంతరం చర్చలు జరుపుతోందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ సెప్టెంబర్ మొదటి వారంలో తెలిపారు.

సంఘర్షణను కొనసాగించే రష్యా సామర్థ్యాన్ని పరిమితం చేయడానికి చర్యలు తీసుకోవాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు పిలుపునిచ్చారు.

Exit mobile version