Udhayanidhi Stalin : సన్ పిక్చర్స్ సంస్థ భారీ ఖర్చుతో లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన చిత్రం కూలీ దుమ్ము రేపుతోంది. ఆగస్టు 14న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఊహించని విధంగా భారీ స్పందన లభిస్తోంది. ఇప్పటికే రూ. 350 కోట్లకు పైగా వసూలు చేసినట్లు సమాచారం. ఇప్పటి వరకు 100 కు పైగా దేశాలలో కూలీని విడుదల చేశారు. ఓవర్సీస్ లో రైట్స్ ను రూ. 80 కోట్లకు పైగా అమ్మారు. ఇది రజనీకాంత్ సినీ కెరీర్ లో 171వ సినిమా కావడం విశేషం. ఇది కూడా రికార్డే. తను సినిమా రంగంలోకి వచ్చి 50 ఏళ్లు అవుతోంది. ఇందులో స్టార్ హీరోలు కీలక పాత్ర లు పోషించారు. వారిలో బాలీవుడ్ కు చెందిన స్టార్ హీరో అమీర్ ఖాన్, టాలీవుడ్ మన్మథుడిగా పేరొందిన అక్కినేని నాగార్జున, కన్నడ చలన చిత్ర పరిశ్రమకు చెందిన ఉపేంద్ర, సత్య రాజ్ , మలయాళం సినీ రంగానికి చెందిన సోబేర్ ముఖ్య పాత్రలు పోషించారు.
Udhayanidhi Stalin Praises Rajinikanth Coolie Movie
ఇదే సమయంలో స్పెషల్ సాంగ్ లో తళుక్కున మెరిసింది నటి పూజా హెగ్డే. తనతో పాటు హీరోయిన్ గా నటించింది ఇలయ నాయగన్ కమల్ హాసన్ కూతురు శ్రుతీ హాసన్ పోషించింది. కూలీ విజయవంతంగా ప్రదర్శిస్తున్న సందర్బంగా తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) స్పందించారు. లేటు వయసులో రజనీకాంత్ అద్భుతంగా నటించాడని కొనియాడారు. కూలీ సినిమాను ఉదయనిధి పవర్-ప్యాక్డ్ మాస్ ఎంటర్టైనర్ అని పేర్కొన్నారు. సినీ రంగంలోకి వచ్చి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోవడం మామూలు విషయం కాదన్నారు. ఈ సినిమాను తాను చూశానని, పూర్తిగా ఆస్వాదించానని తెలిపారు ఉదయనిధి స్టాలిన్. ఇదే సమయంలో అద్భతుంగా తెరకెక్కిచినందుకు దర్శకుడు లోకేష్ కనగరాజ్ ను కూడా అభినందించారు.
Also Read : Hero Rajinikanth Movie History : రజనీకాంత్ 50 ఏళ్ల సినీ ప్రస్థానం
