Rajinikanth : తమిళ సినీ సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) నటించిన చిత్రం కూలీ సూపర్ సక్సెస్ టాక్ తో దూసుకు పోతోంది. ఆగస్టు 14న ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఆశించిన దానికంటే పెద్ద ఎత్తున ఆదరణ లభించింది. ఈ సినిమాకు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీకి ప్రధాన ఆకర్షణ టాప్ హీరోలు ఇందులో నటించడం. అక్కినేని నాగార్జున, సత్య రాజ్, ఉపేంద్ర, అమీర్ ఖాన్, సోబేర్ , శ్రుతీ హాసన్ కీ రోల్స్ పోషించారు. అంతే కాకుండా పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ లో తళుక్కున మెరిసింది. కూలీ మూవీ 171వ సినీ కావడం విశేషం. తన వయసు 70 ఏళ్లకు పైగానే. ఈ వయసులో ఎవరైనా ఇంటి పట్టున ఉండేందుకు ఇష్ట పడతారు. కానీ ఇలా నటించేందుకు పోటీ పడరు. ప్రస్తుతం విడుదలైన నాటి నుంచి నేటి దాకా కూలీ దుమ్ము రేపుతోంది. కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. థియేటర్లలో అభిమానులు ఈలలు, కేకలతో హోరెత్తిస్తున్నారు.
Hero Rajinikanth Movies History
కూలీ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇప్పటి వరకు రూ.350 కోట్లు వసూలు చేసింది. ఇదే సమయంలో పోటీగా జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటించిన వార్ -2 చిత్రం కూడా విడుదలైంది. దానితో ఢీకొంటూ ముందుకు దూసుకు పోతోంది కూలీ. ముందస్తు బుకింగ్ అమ్మకాలలో రూ.100 కోట్లకు పైగా భారీ వ్యాపారం చేసింంది కూలీ. తమిళ సినిమాలో రికార్డులను బద్దలు కొట్టింది . రజనీకాంత్ మూవీ డిజిటల్, శాటిలైట్ , మ్యూజిక్ అమ్మకాల ద్వారా రూ.240 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. రెండున్నర గంటల నిడివి ఉన్న ఈ మూవీని ఎక్కువగా ఆదరించడం విశేషం.
Also Read : Supreme Court Shocking to EC : 65 లక్షల ఓటర్ల జాబితా వెల్లడించాలి
