చెన్నై : తమిళనాట రాజకీయాలు మరింత వేడిని రాజేస్తున్నాయి. అధికారంలో ఉన్న డీఎంకేతో పాటు అన్నాడీఎంకే, బీజేపీ, ఇతర పార్టీలతో నువ్వా నేనా అంటోంది దళపతి విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ. తను ఇప్పటికే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారాడు. తన వాయిస్ ను వినిపిస్తున్నాడు. తమిళనాడు రాష్ట్రంలో రాజకీయాలు తమ ప్రాంతం జోన్ గా ఆధారపడి ఉంటాయి. వారికి స్వాభిమానంతో పాటు ప్రాంతీయతత్వం ఎక్కువ. ఎవరు ఏమన్నా హిందీని ఒప్పుకునేది లేదని అన్ని పార్టీలు ఒక్కటిగా నినదించాయి. అంతే కాదు అమిత్ షాకు చుక్కలు చూపించారు. దమ్ముంటే దా అని కూడా సీఎం ఎంకే స్టాలిన్ సవాల్ కూడా విసిరాడు. తాజాగా ర్యాలీలు, ప్రచార సభలకు శ్రీకారం చుట్టిన టీవీకే బాస్ దళపతి విజయ్ ఇప్పుడు క్రిస్మస్ పండుగను ఘనంగా ఆస్వాదిస్తున్నారు. కరుణ, దయ, ప్రేమ మాత్రమే మనుషులను ఒక్కటి చేయగలదని చెబుతూ కలిసి పోయేందుకు ప్రయత్నం చేస్తున్నాడు.
ఇదిలా ఉండగా తమిళనాడులో క్రిష్టియన్స్ జనాభా ఎక్కువగా ఉంది. వారంతా తమ సామాజిక వర్గానికి చెందిన అగ్ర నటుడు విజయ్ సీఎం కావాలని కోరుకుంటున్నారు. తను కూడా ముందస్తు వ్యూహంలో భాగంగా అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది టీవీకే పార్టీ. తాజాగా జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నాడు విజయ్. అంతే కాదు వారితో కలిసి పాల్గొంటూ క్రిస్మస్ పండుగ సందర్బంగా శుభాకాంక్షలు తెలియ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. మెస్మరైజ్ చేస్తున్నాయి.
