TTD AEO Clear Instructions : నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలి : ఏఈవో

రైస్ మిల్లర్లతో సమావేశంలో వెంక‌య్య చౌద‌రి

Hello Telugu - TTD AEO Clear Instructions

Hello Telugu - TTD AEO Clear Instructions

TTD : తిరుమల : తిరుమలలోని అన్న ప్రసాదాల తయారీకి మరింత నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేయాలని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి రైస్ మిల్లర్లను కోరారు. పద్మావతి విశ్రాంతి గృహంలోని సమావేశ మందిరంలో ఆయన రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. ఏపీ, తెలంగాణ రైస్ మిల్లర్ల అసోసియేషన్ పర్యవేక్షణలో నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా టీటీడీకి (TTD) బియ్యం సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాల‌ని సూచించారు. తద్వారా టీటీడీకి (TTD) మరింత రుచికరమైన అన్న ప్రసాదాలు అందించేందుకు అవకాశం క‌లుగుతుంద‌న్నారు. బియ్యం శాంపిల్ ను తీసుకుని ఉడికించిన తర్వాత క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం మాత్రమే అన్న ప్రసాద వినియోగానికి అనుమతించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రైస్ మిల్లర్లు బియ్యం సరఫరాపై నెలవారీ షెడ్యూల్ టీటీడీ అధికారులకు అందజేయాలని అన్నారు. తద్వారా అధికారులు భక్తుల అవసరాల మేరకు ప్రణాళికా బద్ధమైన ఏర్పాట్లు చేసుకునే అవకాశం క‌లుగుతుంద‌న్నారు ఏఈవో.

TTD AEO Clear Instructions

టీటీడీలో ప్రతిరోజూ తిరుమల, తిరుచానూరుతో పాటు ఇతర స్థానిక ఆలయాల్లో ప్రసాదాల తయారీకి 20 వేల కేజీల బియ్యం వినియోగం జ‌రుగుతుంద‌న్నారు. టీటీడీకి 60:40 నిష్పత్తిలో ఏపీ, తెలంగాణ నుండి రైస్ మిల్లర్ల బియ్యం సరఫరా చేస్తున్నార‌ని చెప్పారు వెంక‌య్య చౌద‌రి. ప్రతినెలా రైస్ మిల్లర్లతో వర్చువల్ సమావేశం, మూడు నెలలకు ఒకసారి నేరుగా సమావేశం నిర్వహించాలని అధికారులకు సూచించారు. శ్రీవారి సేవకుల ద్వారా ఇకపై ప్రతి నెలా అన్న ప్రసాదం నాణ్యతపై సర్వే. భక్తుల అభిప్రాయాలను అనుసరించి బియ్యం నాణ్యత పెంచేలా చర్యలు చేప‌డ‌తామ‌న్నారు. రైస్ మిల్లర్లతో సమావేశం అనంతరం గుబ్బా కోల్డ్ స్టోరేజ్ ఇన్ ఫ్రా సంస్థ ప్రతినిధులు టీటీడీ లోని కోల్డ్ స్టోరేజ్ విభాగం ఆధ్వు కోల్డ్ స్టోరేజ్ సౌకర్యాన్ని అభివృద్ధి చేసే అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

దీనిపై అధ్యయనం చేయడంతో పాటు స్టేట్ వేర్ హౌజ్ కార్పోరేషన్, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, సీఎఫ్టీఆర్ఐ సహకారంతో టీటీడీలో సరుకుల నిల్వపై మరింత మెరుగైన సౌకర్యాలు రూప కల్పనకు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు . ఈ సమావేశంలో అన్న ప్రసాదం డిప్యూటీ ఈవో రాజేంద్ర, వేర్ హౌజ్ డిప్యూటీ ఈవో పద్మావతి, ప్రొక్యూర్ మెంట్ విభాగాధిపతి ఉమా శంకర్, శ్రీవారి ఆలయ పోటు ఏఈవో మునిరత్నం, క్యాటరింగ్ స్పెషల్ ఆఫీసర్ శాస్త్రి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Also Read : AP Govt Gets Huge Investments : కోరమాండ‌ల్ ఇంట‌ర్నేష‌న‌ల్ రూ. 2000 కోట్ల పెట్టుబ‌డి

Exit mobile version