TTD Interesting Updates : సెప్టెంబర్ నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు

వెల్ల‌డించిన కార్య నిర్వ‌హ‌ణ అధికారి శ్యామ‌ల రావు

Hello Telugu - TTD Interesting Updates

Hello Telugu - TTD Interesting Updates

TTD : తిరుమ‌ల – తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి ఈవో జె. శ్యామ‌ల రావు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. వ‌చ్చే సెప్టెంబ‌ర్ నెల‌లో ప‌విత్ర పుణ్య‌క్షేత్రం తిరుమ‌ల‌లో జ‌రిగే విశేష ప‌ర్వ దినాల‌ను వెల్ల‌డించారు. సెప్టెంబ‌ర్ 3వ తేదీన విష్ణు పరివర్తనై ఏకాద‌శి, 4న వామ‌న జ‌యంతి , 6న అనంత పద్మనాభ వ్రతం సందర్భంగా తిరుమల శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం జ‌రుగుతుంద‌ని తెలిపారు ఈవో. సెప్టెంబర్ 8న మహాలయ పక్ష ప్రారంభం అవుతుంద‌ని, 10వ తేదీన బృహత్యుమా వ్రతం (ఉండ్రాళ్ల తద్దె) ఉంటుంద‌న్నారు.

TTD Interesting Updates

16వ తేదీన శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వ‌హిస్తామ‌ని వెల్ల‌డించారు. 21న మహాలయ అమావాస్య , 23వ తేదీన‌ శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జ‌రుగుతుంద‌ని పేర్కొన్నారు ఈవో జె. శ్యామ‌ల రావు. సెప్టెంబర్ 24న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభం, ధ్వజారోహణ కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తామ‌న్నారు. 28న తిరుమల శ్రీవారి గరుడోత్సవం చేప‌డ‌తామ‌న్నారు. 29న తిరుమల శ్రీవారి స్వర్ణ రథం నిర్వ‌హించ‌నున్న‌ట్లు పేర్కొన్నారు శ్యామ‌ల రావు.

ఇదిలా ఉండ‌గా అన్ని టీటీడీ ఆలయాలలో క్రమం తప్పకుండా సాంస్కృతిక, ఆధ్యాత్మిక , భక్తి కార్యక్రమాలు నిర్వహించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు తెలిపారు. అంతే కాకుండా గిరిజన ప్రాంతాలలో శ్రీనివాస కల్యాణాలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తామ‌న్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా అన్న‌మ‌య్య కీర్త‌ల‌ను ప్ర‌చారం చేస్తామ‌న్నారు . ఈ విశేష ప‌ర్వ‌దినాల‌ను పుర‌స్క‌రించుకుని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి ఆధ్వ‌ర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు పేర్కొన్నారు శ్యామ‌ల రావు.

Also Read : TTD EO Shyamala Rao Interesting : అన్న‌మ‌య్య కీర్త‌న‌లు విశ్వ వ్యాప్తం కావాలి : శ్యామ‌ల రావు

Exit mobile version