TTD Padmavati Devi Festival Interesting : శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో విశేష ఉత్సవాలు

వెల్ల‌డించిన తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క‌మండ‌లి

Hello Telugu - TTD Padmavati Devi Festival Interesting

Hello Telugu - TTD Padmavati Devi Festival Interesting

TTD : తిరుప‌తి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో అక్టోబ‌ర్‌ నెలలో జరుగనున్న విశేష ఉత్సవాల వివరాలను ఇవాళ వెల్ల‌డించింది తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాలక మండ‌లి (టీటీడీ). అక్టోబర్ 10, 17, 24, 31వ తేదీలలో శుక్రవారం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు తిరుచ్చి ఉత్సవం సందర్భంగా మాడ వీధులలో భక్తులను శ్రీ పద్మావతీ అమ్మవారు ఆశీర్వాదం అంద‌జేస్తారు. శ్రీ సుందరరాజ స్వామి ఆలయంలో సోమ‌వారం ఉత్తర భద్ర నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గం.లకు తిరుచ్చిపై మాడ వీధులలో శ్రీ సుందరరాజ స్వామి వారు విహరించి భక్తులకు దర్శనం ఇస్తారు. శ్రీ బలరామ కృష్ణ స్వామి వారి ఆలయంలో 11వ తేదీన‌ రోహిణి నక్షత్రం సందర్భంగా సాయంత్రం తిరుచ్చి ఉత్సవం జ‌రుగుతుంద‌ని తెలిపింది టీటీడీ.

TTD Celebrates Sri Padmavati Devi Festival

శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో 20న హస్త నక్షత్రం సందర్భంగా సాయంత్రం 5 గంటలకు తిరుచ్చిపై భక్తులకు శ్రీ సూర్యనారాయణ స్వామి వారు ద‌ర్శ‌నం ఇవ్వ‌నున్నారు. తిరుచానూరులోని శ్రీనివాస స్వామి ఆలయంలో 11, 18, 25 తేదీలలో శ్రీనివాస స్వామి మూలవర్లకు అభిషేకం జ‌రుగుతుంద‌ని తెలిపింది టీటీడీ (TTD). అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో 10, 17, 24, 31 తేదీలలో శుక్రవారం సందర్భంగా ఉదయం 7 గంటలకు అభిషేకం, వస్త్రలంకారణ సేవ నిర్వ‌హిస్తామ‌ని పేర్కొంది. 30వ తేదీ ఉదయం 10.30 గం.లకు కల్యాణోత్సవం జ‌రుగుతుంద‌ని పేర్కొంది. 7న ఉదయం 8 గంటలకు అష్టదళ పాదపద్మారాధన సేవ. 8న ఉదయం 8 గంటలకు అష్టోత్తరశత కలశాభిషేకం. 12, 19, 26 తేదీలలో శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామివారికి అభిషేకం నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపింది టీటీడీ.

Also Read : YS Sharmila Fired on AP Govt : స‌ర్కార్ వైఫ‌ల్యం ప్ర‌భుత్వ హాస్ట‌ళ్లు ఆగ‌మాగం

Exit mobile version