TTD Proven – Subrahmanya Swamy : శ్రీ సుబ్ర‌మ‌ణ్య స్వామికి శ్రీ‌వారి సారె

తిరుత్త‌ణిలో కొలువు తీరిన స్వామి వారు

Hello Telugu - TTD Proven - Subrahmanya Swamy

Hello Telugu - TTD Proven - Subrahmanya Swamy

Subrahmanya Swamy : తిరుమ‌ల – తిరుత్తణి లోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి టీటీడీ తరఫున శ్రీవారి సారె స‌మ‌ర్పించారు. ఆడి కృతిక పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుత్తణి శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి (Subrahmanya Swamy) టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు శనివారం శ్రీవారి సారె సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ మర్యాదలతో తిరుత్తణి ఆలయ చైర్మన్ శ్రీధర్, తమిళనాడు దేవాదయశాఖ జాయింట్ కమిషనర్ రమణి టీటీడీ చైర్మన్‌కు స్వాగతం పలికారు.

Subrahmanya Swamy – TTD

తదుపరి మంగళ వాయిద్యాల నడుమ చైర్మన్ బీ.ఆర్. నాయుడు టీటీడీ తరఫున పట్టు వస్త్రాలను తిరుత్తణి దివ్య క్షేత్రంలో “తనీకేసన్” గా పూజలందుకునే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి సమర్పించారు. వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి దర్శన అనంతరం ఆలయ అర్చకులు టీటీడీ చైర్మన్ బీ.ఆర్. నాయుడుకు ఆశీర్వచనం అందించి, పట్టువస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ మాట్లాడుతూ టీటీడీ తరఫున శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి శ్రీవారి పట్టు వస్త్రాలను సమర్పించడం సంతోషంగా ఉందన్నారు. ఆడికృతిక పర్వదినం సందర్భంగా లక్షలాది మంది భక్తులు తిరుత్తణి చేరుకుంటున్నారని, భక్తులందరికీ స్వామి వారి అనుగ్రహం లభించాలని కోరుకుంటున్నానని తెలియ జేశారు. ఇదిలా ఉండ‌గా ప్ర‌తి ఏటా తిరుత్త‌ణిలోని శ్రీ సుబ్ర‌మ‌ణ్యేశ్వ‌ర స్వామి వారికి తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి త‌ర‌పున సారెను స‌మ‌ర్పించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంద‌న్నారు టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు. కాగా ఈ సారె కార్య‌క్ర‌మానికి పెద్ద ఎత్తున భ‌క్తులు త‌ర‌లి వ‌చ్చారు.

Also Read : TPCC Chief Mahesh Goud Interesting : బీసీ రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించి తీరుతాం

Exit mobile version