TTD Brahmotsavams Interesting : ఆధ్యాత్మిక ఉత్స‌వం సాంస్కృతిక సౌర‌భం

తిరుమ‌లలో శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాలు

Hello Telugu - TTD Brahmotsavams Interesting

Hello Telugu - TTD Brahmotsavams Interesting

TTD : తిరుమ‌ల : తిరుమ‌ల భ‌క్త బాంధ‌వుల‌తో కిట కిట లాడుతోంది. శ్రీ‌వారి సాల‌క‌ట్ల వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు న‌భూతో న‌భ‌విష్య‌త్ అన్న చందంగా కొన‌సాగుతున్నాయి. ఉత్స‌వాల‌లో భాగంగా చంద్రప్రభ వాహన సేవలో దేశంలోని తొమ్మిది రాష్ట్రాల నుండి వచ్చిన 21 కళా బృందాలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆక‌ట్టుకున్నాయి. కళాకారుల అద్భుత ప్రదర్శనలు వాహన సేవలో ఆధ్యాత్మిక శోభను మరింత పెంచాయి.

TTD Brahmotsavams Update

ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఉత్తరాఖండ్ రాష్ట్రాల నుండి 21 బృందాలలలో491 మంది కళాకారులు భరతనాట్యం, మోహినియాట్టం, కథాకళి, గౌడీయ నృత్యం, కృష్ణ మహీమ, గంగావతార్ రూపకం, శ్రీ రుక్మిణీశ విజయ, రసమయి గోవింద స్మృతి, మంజునాథ చరితం ప్రదర్శించారు.

ఉత్తరాఖండ్ కు చెందిన కళాకారులు జానపద నృత్యాలు, హరుల్ చోళియ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన కళాకారుల కోలాటం, మహారాష్ట్ర – వారాకరీ భజన, జానపద నృత్యం, బతుకమ్మ, భాంగ్రా భక్తులను మంత్ర ముగ్ధులను చేసింది. అదే విధంగా గోదాదేవి కళ్యాణం, అష్టలక్ష్ములు, అళ్వార్ వేశ ధారణ, డ్రమ్స్ ప్రదర్శన భక్తులలో మరింత ఆధ్యాత్మిక భక్తి భావాన్ని పెంపొందించాయి. వివిధ రాష్ట్రాల సంస్కృతుల సమ్మేళనం భక్తులను ఆనంద డోలికల్లో ముంచెత్తింది.

Also Read : TTD New Innovation : పోకేట్ పుస్త‌కాల‌ను ఆవిష్క‌రించిన టీటీడీ చైర్మ‌న్

Exit mobile version