TTD New Innovation : పోకేట్ పుస్త‌కాల‌ను ఆవిష్క‌రించిన టీటీడీ చైర్మ‌న్

ముద్రించిన హిందూ ధ‌ర్మ ప్ర‌చార ప‌రిష‌త్

hellotelugu-ttdchairman

TTD : తిరుమ‌ల : శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు న‌భూతో న‌భ‌విష్య‌త్ అన్న రీతిలో కొన‌సాగుతున్నాయి. పెద్ద ఎత్తున టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఉత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకుని శ్రీవారి భక్తులకు పుస్తక ప్రసాదం అందించేందుకు వీలుగా 10 ప్యాకెట్ సైజ్ పుస్తకాలను టిటిడి (TTD) ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆవిష్కరించారు. తిరుమలోని వాహన మండపంలో చంద్రప్రభ వాహనం ప్రారంభం అయ్యాక ఈ కార్యక్రమం జరిగింది. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ), హిందూ ధర్మ ప్రచార పరిషత్ ముద్రించిన శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం, శ్రీ శ్రీనివాసుని దివ్య కథ, భజ గోవిందం, శ్రీ శంకరాచార్య కృత స్తోత్రములు, విష్ణు సహస్రనామ స్తోత్రం, శ్రీ లలిత సహస్ర నామ స్తోత్రం, శ్రీమద్ భగవద్గీత, రథసప్తమి, మహాశివరాత్రి, కార్తీక వైభవం తదితర పుస్తకాలను భక్తులకు ఉచితంగా అందించే కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టారు.

TTD New Innovation

ఈ సందర్భంగా చంద్రప్రభ వాహనం సేవకు వచ్చిన భక్తులకు టిటిడి ఛైర్మన్ బీఆర్ నాయుడు పుస్తక ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు టిటిడి బోర్డు సభ్యులు, హెచ్డిపిపి సెక్రటరీ శ్రీరాం రఘునాథ్ పలువురు అధికారులు పాల్గొన్నారు. ఇదిలా ఉండ‌గా భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది టీటీడీ. ఈ సంద‌ర్భంగా దేశ‌, విదేశాల న‌లమూల‌ల నుంచి తండోప తండాలుగా త‌ర‌లి వ‌చ్చిన భ‌క్త బాంధ‌వులు టీటీడీ ఏర్పాట్ల‌పై సంతృప్తిని వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్బంగా ధ‌న్య‌వాదాలు తెలిపారు టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్.

Also Read : Donald Trump Shocking Comments : నోబెల్ గెల‌వ‌క పోవ‌డం అమెరికాకు అవ‌మానం

Exit mobile version