TTD : తిరుమల : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఘణంగా జరుగుతున్నాయి. భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు టీటీడీ (TTD). శ్రీ మలయప్ప స్వామి వారు శ్రీదేవి, భూదేవితో కలిసి కాళీయ మర్ధనుడి అలంకారంలో దర్శనమిచ్చారు భక్తులకు. మాడ వీధుల్లో అంగరంగ వైభవంగా జరిగిన వాహన సేవలో వివిధ కళా బృందాల ప్రదర్శనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామి వారిని వాహన సేవలో దర్శించుకున్నారు.
TTD – Kaliya Mardhana Avatar
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు రాత్రి శ్రీ మలయప్ప స్వామి వారు ముత్యపు పందిరి వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇచ్చారు. జ్యోతిష శాస్త్రం చంద్రునికి ప్రతీకగా ముత్యాలను తెలియజేస్తుంది. శ్రీకృష్ణుడు ముక్కుపై, మెడలో ముత్యాల ఆభరణాలు ధరించినట్టు పురాణాల్లో ఉంది. ఆది శేషుని పడగలను ముత్యాల గొడుగా పూనిన స్వామివారిని దర్శించినా, స్తోత్రం చేసినా సకల శుభాలు కలుగుతాయని పురాణ ప్రశస్తి. చల్లని ముత్యాలకింద నిలిచిన శ్రీనివాసుని దర్శనం తాపత్రయాలను పోగొట్టి, భక్తుల జీవితాలకు చల్లదనాన్ని సమకూర్చుతుంది.
వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, తిరుమల శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, టీటీడీ ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, పలువురు బోర్డు సభ్యులు, జెఈవో వీరబ్రహ్మం, సివిఎస్వో మురళి కృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Also Read : Sri Lalita Tripurasundari Devi Interesting : శ్రీ లలితా త్రిపురసుందరి దేవీగా కనకదుర్గమ్మ


















