TTD EO Shyamala Rao : తిరుమల – తిరుమలలో జరుగుతున్న అభివృద్ధి పనులను డెడ్ లైన్ లోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు టీటీడీ ఈవో జె. శ్యామల రావు. పనుల పురోగతిపై విభాగాల వారీగా అధికారులతో టీటీడీ ఈవో జె.శ్యామలరావు (TTD EO Shyamala Rao), అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరితో కలిసి తిరుమలలోని అన్నమయ్య భవన్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు.
TTD EO Shyamala Rao Comments
ఈ సందర్భంగా తిరుపతిలో ఎస్ఎస్‌డీ కౌంటర్ల నిర్వహణ, అన్నప్రసాదం విభాగం ఆధునీకరణ, పరకామణి నిర్వహణ, పారిశుద్ధ్యం, టాస్క్ ఫోర్స్ బృందాల ద్వారా బాలాజీ నగర్ గృహాల పరిశీలన, కాలిబాట మార్గాలలోని దుకాణాల తనిఖీలు, యాత్రికుల వసతి సముదాయాల్లో కేంద్రీకృత లాకర్ కేటాయింపు వ్యవస్థ, ఎఫ్ఎంఎస్ మొబైల్ యాప్ వినియోగం, తిరుమలలో ల్యాండ్‌స్కేప్ సర్వే, కొత్తగా రూపొందిస్తున్న కాటేజ్ డొనేషన్ పాలసీ, సీఆర్వో పునర్నిర్మాణం వంటి అంశాలపై వివరంగా చర్చించారు.
భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు నిర్దేశిత సమయంలోపు తమకు కేటాయించిన పనులను పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జేఈవో వీరబ్రహ్మం, సీవీఎస్వో మురళీ కృష్ణ (వర్చువల్ గా హాజరవ్వగా), డీఎఫ్వో ఫణి కుమార్ నాయుడు, సిఈ సత్య నారాయణ, ట్రాన్స్ పోర్ట్ అండ్ ఐటీ జీఎం శేషారెడ్డి, ఎస్టేట్ ఆఫీసర్ వేంకటేశ్వర్లు, టౌన్ ప్లానింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అధికారి రాముడు, డిప్యూటీ ఈవోలు భాస్కర్, శ్రీ సోమన్నారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Also Read : Tirumala Strict Security : తిరుమలలో భక్తుల కోసం భద్రత కట్టుదిట్టం



















