Tsunami : రష్యా, జపాన్ దేశాలలో బుధవారం ఉదయం భారీ భూకంపం చోటు చేసుకుంది. 2011 తర్వాత అత్యంత ఇరు దేశాలను సునామీ తాకింది. హోనోలులులో సునామీ హెచ్చరిక సైరన్‌లు మోగాయి. ప్రజలు ఎత్తైన ప్రాంతాలకు తరలివెళ్లారు. ప్రపంచంలోని అత్యంత బలమైన భూకంపంగా దీనిని పేర్కొన్నారు. ఇవాళ తెల్లవారుజామున రష్యాలోని ఫార్ ఈస్ట్ ను తాకింది. 8.8 తీవ్రతతో కూడిన భూకంపం ఉత్తర పసిఫిక్ ప్రాంతంలో సునామీని సృష్టించింది. అలాస్కా, హవాయి, న్యూజిలాండ్ వైపు దక్షిణాన ఉన్న ఇతర తీరాలకు హెచ్చరికలను ప్రేరేపించింది.
Tsunami Shocking in Japan and Russia
జపాన్ (Japan) వాతావరణ సంస్థ దేశంలోని ప్రధాన దీవులకు ఉత్తరాన ఉన్న హక్కైడో దక్షిణ తీరంలోని టోకాచిలో 40 సెంటీమీటర్ల ఎత్తులో సునామీని గుర్తించినట్లు తెలిపింది. కమ్చట్కా ద్వీపకల్పంలోని భూకంప కేంద్రానికి దగ్గరగా ఉన్న రష్యన్ ప్రాంతాలు తీవ్రంగా నష్ట పోయాయి. స్థానిక గవర్నర్ వాలెరీ లిమారెంకో ప్రకారం,పసిఫిక్‌లోని రష్యాలోని కురిల్ దీవులలోని ప్రధాన స్థావరమైన సెవెరో-కురిల్స్క్ తీర ప్రాంతాన్ని మొదటి సునామీ అల తాకింది. ప్రజలు బీచ్‌లు, నౌకాశ్రయాలు, మెరీనాలకు దూరంగా ఉండాలని కోరింది. తీరానికి దూరంగా సురక్షితమైన ప్రదేశంలో ఉండాలని ఇది కోరింది.
కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్, వాషింగ్టన్, కాలిఫోర్నియాలో విస్తరించి ఉన్న పశ్చిమ తీరంలో చాలా వరకు సునామీ హెచ్చరికలు జారీ చేయబడ్డాయి. జపాన్ లో ఇవాళ ఉదయం 8.25 గంటలకు భూకంపం సంభవించింది. ప్రాథమిక తీవ్రత 8.0గా తేల్చింది. ఈ భూకంపం కారణంగా పెట్రోపావ్లోవ్స్క్-కామ్‌చాట్స్కీలోని వీధుల్లో భవనాలు, కార్లు దెబ్బతిన్నాయి.
Also Read : Prakasam Barrage Huge Water Flow : ప్రకాశం బ్యారేజీకి పోటెత్తిన వరద

















