Pak Ex PM Imran Khan Sensational Allegations : న‌న్ను నా భార్య‌ను టార్చ‌ర్ చేస్తున్నారు

సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన ఇమ్రాన్ ఖాన్

Hello Telugu - Pak Ex PM Imran Khan Sensational Allegations

Hello Telugu - Pak Ex PM Imran Khan Sensational Allegations

Imran Khan : పాకిస్తాన్ : పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. తనపై, భార్య పొరుగువారిపై మానసిక హింసకు గురి చేస్తున్నారంటూ వాపోయాడు. రాజకీయ నాయకుడిగా మారిన 72 ఏళ్ల మాజీ క్రికెటర్ రెండు సంవత్సరాలకు పైగా బహుళ కేసుల్లో జైలులో ఉన్నాడు. ప్రస్తుతం ఆయన రావల్పిండిలోని అడియాలా జైలులో ఉన్నారు. జైలులో నాపై, నా భార్య‌ బుష్రా బేగంను తీవ్రంగా వేధింపుల‌కు గురి చేస్తున్న‌డ‌ని ఆయ‌న ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశాడు. త‌న‌ ఏకైక ఉద్దేశ్యం మమ్మల్ని విచ్ఛిన్నం చేసి లొంగిపోయేలా చేయడం త‌ప్ప మ‌రోటి కాద‌ని పేర్కొన్నాడు ఇమ్రాన్ ఖాన్.

Imran Khan Sensational Comments

ఈ సంవత్సరం ప్రారంభంలో అల్-ఖాదిర్ ట్రస్ట్ కేసుల్లో వీరిద్దరూ దోషులుగా తేలిన తర్వాత అతని భార్య బుష్రా బీబీ కూడా జైలులో చేరారు. అసిమ్ మునీర్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చాడు. తాను లొంగి పోయే ప్ర‌స‌క్తి లేద‌న్నాడు. క్రూరత్వం, నిరంకుశత్వానికి పేరుగాంచిన శతాబ్దాల నాటి పాలకులను ప్రస్తావిస్తూ కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. జనరల్ మునీర్ మన దేశంలో చట్ట విరుద్ధంగా, ఫాసిజం వాతావరణాన్ని సృష్టించడానికి సైన్యాన్ని ఉపయోగిస్తున్నారని పేర్కొన్నారు. అసిమ్ మునీర్ తన చట్టవిరుద్ధ పాలనను 10 సంవత్సరాలు పొడిగించడానికి ఎటువంటి రాయిని వదిలిపెట్టలేదని మండిప‌డ్డారు ఇమ్రాన్ ఖాన్.

జనరల్ అసిమ్ మునీర్ ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి అతను ఆఫ్ఘనిస్తాన్‌తో సంబంధాలను దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తున్నాడని ఖాన్ అన్నారు. పదవి స్వీకరించిన తర్వాత, అతను మొదట ఆఫ్ఘనిస్తాన్‌కు బెదిరింపులు జారీ చేశాడు, తరువాత మూడు తరాలుగా ఇక్కడ నివసిస్తున్న ఆఫ్ఘన్ జాతీయులను బహిష్కరించాడు. అంతే కాదు డ్రోన్ దాడులు చేప‌ట్టాడ‌ని ఆరోపించారు. పాకిస్తాన్‌తో పోరాడటానికి వారిని రెచ్చగొట్టడానికి అన్ని ప్రయత్నాలు చేశాడని అన్నారు.

Also Read : Saudi Arabia-Pakistan Shocking Deal : పాక్ అణు రక్షణ కవచం సౌదీ అరేబియాకు అందుబాటులోకి

Exit mobile version