Trump : అమెరికా : అమెరికా దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆయన భారత దేశానికి చెందిన ప్రవాస భారతీయుడైన వివేక్ రామస్వామికి కీలకమైన పదవి కోసం మద్దతు ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించి శనివారం కీలక అప్ డేట్ వచ్చింది. అదేమిటంటే వివేక్ రామస్వామి ఒహియో గవర్నర్ గా తనను నియమించాలని యోచిస్తున్నారు. రిపబబ్లికన్ పార్టీ నాయకుడిగా ఇప్పటికే తను గుర్తింపు పొందారు. గతంలో జరిగిన ఎన్నికల్లో తను కీలకమైన పాత్ర పోషించారు. ట్రంప్ కు నమ్మకమైన మద్దతుదారుగా ఉన్నారు. వివేక్ రామస్వామి తప్పకుండా ఒహియోకు గవర్నర్ కావడం ఖాయమని తన మనసులోని మాటను చెప్పారు ట్రంప్. నా పూర్తి మద్దతు కూడా తనకే ఉందన్నారు.
Trump Approved Vivek Ramaswamy As a Ohio Governor
ఇదే సమయంలో వివేక్ రామ స్వామి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక అయిన ట్రూత్ . తన గురించి తనకు బాగా తెలుసన్నాడు ట్రంప్. అంతే కాదు యువకుడు, సమర్థుడు, అద్భుతమైన నాయకత్వ నైపుణ్యం కలిగిన వాడు. ఇంతకు మించి తనకు అత్యంత నమ్మకమైన, ఆప్తుడు, ఆపై స్నేహితుడు అని పేర్కొన్నాడు. తను నాతో పాటే ఉండడం ఇప్పుడు అత్యంత అవసరమని పేర్కొన్నారు డొనాల్డ్ ట్రంప్. దీంతో వివేక్ రామస్వామి ఒహియో నగరానికి గవర్నర్ కావడం ఖాయమై పోయినట్లేనని భావించక తప్పదు. మొత్తంగా మరో ఎన్నారై కీలకమైన పదవిలో కొలువు తీర బోతున్నాడన్న మాట.
Also Read : Jemima Rodrigues Shocking Comments : భారత దేశంలో క్రికెట్ ఓ మతం – జెమీమా రోడ్రిగ్స్















