Peter Navarro : అమెరికా – అగ్రరాజ్యం అమెరికా తన వైఖరి మార్చు కోవడం లేదు. పదే పదే ఇండియాపై, ప్రధాని మోదీపై నోరు పారేసుకుంటోంది. రష్యా చమురు ఒప్పందంపై ట్రంప్ వాణిజ్య సలహాదారుడు పీటర్ నవారో (Peter Navarro) సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన అంతర్జాతీయ మీడియాతో మాట్లాడారు. మరో వైపు భారత దేశం చైనాతో సంబంధాలను సజావుగా చేసుకుంటున్నందుకు భారతదేశంపై దాడి చేశాడు. ఆగస్టు 31న చైనా దేశ అధ్యక్షుడు జిన్ పింగ్ తో ప్రత్యేకంగా భేటీ కానున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. నిన్నటి దాకా సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి.
Peter Navarro Key Comments on PM Modi
ఇదే సమయంలో అమెరికా దేశ అధ్యక్షుడిగా ట్రంప్ కొలువు తీరాక పదే పదే చెత్త నిర్ణయాలు తీసుకుంటూ బెంబేలెత్తిస్తున్నారు. ఏకంగా ఇండియాపై 50 శాతం సుంకాలు విధించారు. దీంతో భారత్ కూడా తల వంచేది లేదంటూ స్ట్రాంగ్ గా జవాబు ఇచ్చింది. మరో వైపు పాకిస్తాన్, ఇండియా మధ్య జరిగిన యుద్దంలో భారత్ పై చేయిదిగా ఉంది. ఈ తరుణంలో రష్యాతో చమురు డీల్ బంద్ చేయాలని పదే పదే కామెంట్స్ చేస్తూ వస్తోంది అమెరికా. లేకపోతే చర్యలు తప్పవని, సుంకాలు మరిన్ని విధిస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు ట్రంప్. దీనికి వత్తాసుగా పీటర్ నవార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మాస్కో, బీజింగ్‌తో భారతదేశం పెరుగుతున్న సంబంధాలపై తన నిరాశను వ్యక్తం చేశాడు. రష్యా-ఉక్రెయిన్ సంఘర్షణను ప్రధాని మోడీ యుద్ధంగా అభివర్ణించారు. రష్యా దూకుడుకు వ్యతిరేకంగా ఉక్రెయిన్‌కు అమెరికా, యూరప్ నిధులు సమకూర్చడం వెనుక భారతదేశమే కారణమని నవారో నిందించాడు.
Also Read : Arjun Tendulkar Engagement Interesting : సానియా చాంధోక్ తో అర్జున్ టెండూల్కర్ నిశ్చితార్థం
