Arjun Tendulkar : ముంబై – ఎవరూ ఊహించని విధంగా తనకంటే వయసులో పెద్ద అయిన అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు ప్రముఖ స్టార్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తనయుడు, పేసర్ గా గుర్తింపు పొందిన అర్జున్ టెండూల్కర్ (Arjun Tendulkar). విస్తు పోయేలా ముంబైకి చెందిన జంతు సంక్షేమ న్యాయవాదిగా ఉన్న సానియా చాంధోక్ తో తాను ఎంగేజ్మెంట్ చేసుకుటున్నట్లు ప్రకటించాడు. విచిత్రం ఏమిటంటే తన తండ్రి టెండూల్కర్ కూడా తన కంటే వయసు రీత్యా పెద్ద అయిన ఆమెను పెళ్లి చేసుకున్నాడు.
Arjun Tendulkar – Sania Chandhok Engagement
సచిన్ టెండూల్కర్ కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒకరు అర్జున్ టెండూల్కర్ కాగా మరొకరు సారా టెండూల్కర్. తను ప్రముఖ క్రికెటర్, ఇండియా టెస్టు జట్టు వైస్ కెప్టెన్ శుభమన్ గిల్ తో కొన్ని రోజులు డేటింగ్ లో ఉన్నట్లు ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత మౌనంగా ఉండి పోయింది. ఇప్పుడు తన సోదరుడు తనకంటే పెద్ద అయిన ఆమెతో ప్రేమలో పడటం, చివరకు నిశ్చితార్థం దాకా వెల్లడం విస్తు పోయేలా చేసింది.
ఇక 1995లో, సచిన్ టెండూల్కర్ తన కంటే ఆరు సంవత్సరాలు పెద్ద దైన ప్రఖ్యాత శిశు వైద్యురాలు అంజలి మెహతాను వివాహం చేసుకున్నాడు. టెండూల్కర్ ఒక్కడే కాదు పలువురు క్రికెటర్లు ఇందులో ఉన్నారు. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన భార్య, నటి అనుష్క శర్మ కంటే ఆరు నెలలు చిన్నవాడు. జస్ప్రీత్ బుమ్రా క్రీడా ప్రెజెంటర్ సంజన గణేషన్ కంటేడు సంవత్సరాలు చిన్నవాడు. శివం దుబే తన కంటే ఆరు సంవత్సరాలు పెద్దదైన అంజుమ్ ఖాన్‌ను మనువాడాడు. రాబిన్ ఉతప్ప మాజీ టెన్నిస్ క్రీడాకారిణి శీతల్ గౌతమ్ కంటే నాలుగు సంవత్సరాలు చిన్నవాడు. అనిల్ కుంబ్లే చేతనా రామతీర్థ కంటే రెండు సంవత్సరాలు చిన్నవాడు.
Also Read : AP Govt – Journalist Houses Interesting : జర్నలిస్టుల ఇళ్ల కోసం కేబినెట్ లో చర్చిస్తాం
