Tripti Dimri : డైనమిక్ డైరెక్టర్ వంగా సందీప్ రెడ్డి దర్శకత్వంలో ఇప్పటికే రిలీజ్ అయిన యానిమల్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇందులో రష్మిక మందన్నాతో పాటు త్రిప్తి దిమ్రీ (Tripti Dimri) కూడా నటించింది. నటనా పరంగా మంచి మార్కులు కొట్టేసింది. ఎవరూ ఊహించని రీతిలో ప్రభాస్ తో వంగా సందీప్ రెడ్డి తీసే స్పిరిట్ మూవీ కోసం ఎంపికైంది. దీంతో దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది ఈ నటి. ఇది ఊహించని ఛాన్స్ అని పేర్కొంది. స్పిరిట్ కోసం ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నట్లు చెప్పింది.
Tripti Dimri Comments
ఈ ఒక్క ఛాన్స్ తో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో కొనసాగుతుంది ఈ ముద్దు గుమ్మ. తను తాజాగా నటించిన చిత్రం ధడక్ 2 మూవీ ఆగస్టు 1న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. చిట్ చాట్ సందర్బంగా త్రిప్తి దిమ్రీ తన మనసులోని మాటను బయట పెట్టింది. ఒక్కో దర్శకుడు ఒక్కో టాలెంట్ కలిగి ఉంటారని పేర్కొంది. ప్రత్యేకించి వంగా సందీప్ రెడ్డి గురించి ఎంత చెప్పినా తక్కువేనని పేర్కొంది. యానిమల్ మూవీలో ఇప్పటికే షూటింగ్ చేసిన సందర్బంగా తను ఎలా పని చేస్తాడో తనకు క్లారిటీ ఉందని చెప్పింది ఈ లవ్లీ గర్ల్.
ఇక డిఫరెంట్ మూవీస్ లో నటిస్తే ఆ కిక్ వేరుగా ఉంటుందన్నారు. కెరీర్ పరంగా ఎన్నో విషయాలు నేర్చుకునేందుకు వీలు కలుగుతుందన్నారు త్రిప్తి దిమ్రీ. ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ విశాల్ భరద్వాజ్ తీస్తున్న చిత్రంలో నటిస్తున్నానని చెప్పింది.
Also Read : Hero Raviteja Movie : భారీ ధరకు మాస్ మహరాజా మూవీ ఓటీటీ డీల్



















