హైదరాబాద్ : సికింద్రాబాద్ రైల్వే నిలయం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వ్యంలో బుధవారం మెరుపు ధర్నా చేపట్టారు. భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ సందర్బంగా టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు సీనియర్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నవంబర్ 1న ఢిల్లీలో జరిగే కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమానికి రైళ్లు కేటాయించకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు మహేష్ కుమార్ గౌడ్. సికింద్రాబాద్ రైల్వే నిలయం ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టడం కలకలం రేపింది. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రైల్వే నిలయంలోని జీఎం కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.
ఈ ధర్నాలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తో పాటు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు నవీన్ యాదవ్, గణేష్, డీసీసీ అధ్యక్షులు మోత రోహిత్, దీపక్ జాన్ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. నగరం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు తరలివచ్చి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం పోలీసులు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసి మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు టీపీసీసీ చీఫ్ , మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ లు. కేంద్ర సర్కార్ కావాలని కాంగ్రెస్ ను అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.
