విద్యార్థుల ఆరోగ్య భద్రతకు పెద్దపీట : స‌విత

స్ప‌ష్టం చేసిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి

hellotelugu-SSavitha

అమ‌రావ‌తి : ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కూట‌మి స‌ర్కార్ విద్యార్థుల ఆరోగ్యంపై ఫుల్ ఫోక‌స్ పెట్టామ‌న్నారు. విద్యతోనే బీసీలను అన్ని రంగాల్లోనూ ప్రగతి సాధించగలరన్నది సీఎం చంద్రబాబు ఉద్దేశం అన్నారు. ఇవాళ స‌విత మీడియాతో మాట్లాడారు. అందుకే బీసీ బిడ్డల విద్యకు, వారి ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ బీసీ హాస్టళ్లలో మౌలిక సదుపాయల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా 971కి పైగా మరుగుదొడ్ల నిర్మాణం విస్తృతంగా చేపట్టామ‌న్నారు. ఇప్పటికే కొన్ని హాస్టళ్లలో నిర్మాణాలు పూర్తికాగా, మరికొన్నింటిలో మరో నెల రోజుల్లో ప్రారంభం కానున్న విద్యా సంవత్సరం నాటికి పూర్తి చేయనున్నామ‌ని చెప్పారు.

అన్ని హాస్టళ్లలో పరిశుభ్రమైన తాగునీరు అందించడానికి రూ.21 కోట్లతో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామ‌ని చెప్పారు స‌విత‌. దోమల నివారణే లక్ష్యంగా రూ.6 కోట్లు వెచ్చించి, అన్ని హాస్టళ్లలోనూ తలుపులకు, కిటికీలకు దోమ తెరలు ఏర్పాటు చేశామ‌న్నారు. హాస్టళ్లలో నిరంతర విద్యుత్ సరఫరా చేసేలా రూ.20 కోట్లతో ఇన్వర్టర్లను ఏర్పాటు చేసిందన్నారు స‌విత‌. వంట పాత్రలు, ఇతర సామాగ్రి కోసం రూ.18 కోట్లు అంద చేశామ‌న్నారు. పౌష్టికాహారం అమలులో భాగంగా హాస్టల్ విద్యార్థులకు సన్న బియ్యంతో భోజనం అందిస్తున్నామ‌ని అన్నారు. మెనూ సక్రమంగా అమలు కోసం కుక్ లు, కమాటీలను ప్రభుత్వం ఇప్పటికే నియమించిందని వెల్ల‌డించారు. హాస్టళ్లలో పరిశుభ్రత కోసం 1,291 పారిశుధ్య సిబ్బందిని త్వరలో నియమించడానికి చర్యలు చేపట్టామ‌న్నారు. బీసీ హాస్టళ్లలో చదివే విద్యార్థులకు ఆరోగ్య, ఆహార భద్రతతో కూడిన విద్య అందించాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యం అన్నారు.

Exit mobile version