అహ్మదాబాద్ : పొట్టి ప్రపంచ కప్ 2026 విజేత ఎవరో ఇవాళ తేలి పోనుంది. ఇప్పటికే అన్ని టికెట్లు అమ్ముడు పోయాయి. ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియంగా పేరు పొందింది గుజరాత్ లోని అహ్మదాబాద్ మోదీ స్టేడియం. అత్యాధునిక సౌకర్యాలతో అందంగా తీర్చిదిద్దారు. న్యూజిలాండ్ తో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్దమైంది సూర్య కుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు. ఇండియా క్వార్టర్స్ లో విండీస్ ను 5 వికెట్ల తేడాతో , సెమీ ఫైనల్ లో ఇంగ్లండ్ ను 7 పరుగుల తేడాతో ఓడించింది . ఫైనల్ కు చేరుకుంది. సర్వ శక్తులు ఒడ్డేందుకు సిద్దమై ఉన్నామని ప్రకటించాడు కెప్టెన్ సూర్యా భాయ్. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వ్యూహాలు పని చేస్తాయా భారత ఆటగాళ్లు రాణిస్తారా అన్నది వేచి చూడాలి.
ఇప్పటికే రికార్డు స్తాయిలో భారత్ తో జరిగిన మ్యాచ్ లను వీక్షించినట్లు స్వయంగా ప్రకటించాడు బీసీసీఐ కార్యదర్శి జే షా. సెమీ ఫైనల్ మ్యాచ్ ను రెండున్నర కోట్ల మందికి పైగా వీక్షించినట్లు, ఇది డిజిటల్ ఫార్మాట్ లో అరుదైన రికార్డ్ అని పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా ఇప్పటికే పరుగులు ఎక్కువగా ఇవ్వడంతో వరుణ్ చక్రవర్తిని కొనసాగిస్తారా లేదా అన్న దానిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్. తను వరల్డ్ క్లాస్ బౌలర్ అని, తనను పక్కన పెట్టే ఆలోచన ఇప్పటి వరకు చేయడం లేదన్నాడు. ఇక బ్యాటింగ్ పరంగా అభిషేక్ శర్మ తో పాటు కెప్టెన్ ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. ఇవాళ విశ్వ విజేత ఎవరో తేలి పోనుంది.



















