K Kavitha : హైదరాబాద్ : తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (K Kavitha) దూకుడు పెంచారు. ఆమె తిరుమలను కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అంతకు ముందు బీసీ రిజర్వేషన్ల కోసం బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు బీసీ బందులో పాల్గొన్నారు. హైదరాబాద్ లో నిర్వహించిన మానవ హారంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. ఈనెల 25వ తేదీ నుంచి ఆమె జనం బాట పేరుతో ప్రజల్లోకి వెళ్లేందుకు ప్లాన్ చేశారు. ఈ మేరకు యాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగా సంస్థను మరింత బలోపేతం చేసేందుకు గాను తెలంగాణ జాగృతి సంస్థ ఐటీ విభాగాన్ని ఏర్పాటు చేశారు. వారికి నియామక పత్రాలు అందజేశారు. ఈ నియామకాలు వెంటనే అమల్లోకి వస్తాయని జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి స్పష్టం చేశారు. ఈ మేరకు అధికారికంగా వెల్లడించారు.
K Kavitha Shocking Update
టీజేసీ ఐటీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా గుండె బోయిన శశిధర్ ను నియమించినట్లు తెలిపారు. ఉపాధ్యక్షుడిగా పశుపతినాథ్ గజవాడ, ప్రధాన కార్యదర్శిగా ఎల్ కె అశోక్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా రాజేష్ గౌడ్, కార్యదర్శులుగా సంజయ్, కుమ్మరి రమేష్, ముఖేష్ గౌడ్, కోశాధికారిగా ఆర్. కిరణ్, ఐటీ వింగ్ రాష్ట్ర మహిళా ప్రతినిధిగా పద్మను నియమించినట్లు వెల్లడించారు. అధికార ప్రతినిధిగా పి. శక్తి స్వరూప్ సాగర్, కో ఆర్డినేటర్ అన్నపూర్ణ, పీఆర్ఓ గా విజయ్ రాజా జెట్టి, సోషల్ మీడియా కో ఆర్డినేటర్ గా ఎ. రాజు, సభ్యత్వ కో ఆర్డినేటర్ గా డి. రవి, మీడియా కో ఆర్డినేటర్ గా బి. సురేష్ ను నియమించినట్లు తెలిపారు నవీన్ ఆచారి.
Also Read : Harish Rao Fired on Congress Govt : సర్కార్ నిర్వాకం అన్నదాతలు ఆగమాగం
